6,499కే అదిరిపోయే ఆఫర్!!

సామాన్యుని నేస్తం మైక్రోమ్యాక్స్ తన తొలి టాబ్లెట్ కంప్యూటర్‌ను చవకే ధరకే అందించనుంది. ఫన్‌బుక్‌గా మార్కెట్లో లభ్యంకానున్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవనుంది. తక్కువ ధర గ్యాడ్జెట్ అయినప్పటికి పనితీరు విషయంలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తుంది. నిక్షిప్తం చేసిన 1.2 జిగాహెడ్జ్ ప్రాసెసర్ డివైజ్ పనివేగాన్ని రెట్టింపు చేస్తుంది.
7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే 800 x 480 పిక్సల్ హై రిసల్యూషన్‌ను కలిగి ఉంటుంది. మల్టీ టచ్ ఇన్‌పుట్‌లతో పాటు జూమ్ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది. పీసీలో నిక్షిప్తం చేసిన మన్నికైన గ్రాఫిక్ ప్రాసెసర్ ఉత్తమమైన మల్టీ మీడియా అనుభూతులను చేరవచేస్తుంది. ఇంటర్నల్ మెమెరీ 4జీబి, ర్యామ్ సామర్ద్యం 512ఎంబీ. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకోవచ్చు.
ఏర్పాటు చేసిన వై-ఫై, 3జీ కనెక్టువిటీ వ్యవస్థలు వేగవంతమైన ఇంటర్నెట్‌ను సపోర్ట్ చేస్తాయి. వినియోగదారుడు ఈ టాబ్లెట్ కోనుగోలు పై టాటా ఫూటాన్ EVDO డేటా కార్డును ఉచితంగా పొందవచ్చు. కొన్ని నెలల పాటు ఈ కార్డ్ నుంచి 1జీజి డేటా వరకు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బ్లాక్ మరియు స్లేట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ గ్యాడ్జెట్ డిజైన్ కాబడింది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన వీజీఏ ఫ్రంట్ కెమెరా 0.3 మెగా పిక్సల్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పలు బేసిక్ అప్లికేషన్‌లను ముందుగానే ప్రీలోడ్ చేశారు. ఎంబీఏ, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు కోసం స్టడీ మెటీరియల్‌ను పీసీలో నిక్షిప్తం చేశారు. ధర రూ.6,499.


Click it and Unblock the Notifications