మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ470@6,999

Posted By:

భారత దేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ఓ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ‘కాన్వాస్ ట్యాబ్ పీ470' గా రాబోతున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌ను డిసెంబర్ 20 నుంచి అన్ని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచుతున్నట్లు మైక్రోమాక్స్ తెలిపింది. క్లాసిక్ సిల్వర్, మిస్టిక్ గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ డివైస్ ధర రూ.6,999.

 మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ470@6,999

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

కాన్వాస్ ట్యాబ్ పీ470 స్పెసిపికేషన్‌లు:

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024x600పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ8312 ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. తెలుగు సహా 21 ప్రాంతీయ భాషలను ఈ ట్యాబ్ సపోర్ట్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Micromax to Launch Canvas Tab P470 Exclusively on Retail Stores in India From Dec 20. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot