సామ్‌సంగ్‌ను బీట్ చేసిన మైక్రోమ్యాక్స్!

By Super
|
Micromax


2012, రెండో త్రైమాసికానికి గాను దేశీయంగా 0.55 మిలియన్ యూనిట్ల టాబ్లెట్ పీసీలు అమ్ముడైనట్లు సైబర్ మీడియా రిసెర్చ్ ప్రకటించింది. ఈ విక్రయాల్లో భాగంగా 18.4% అమ్మకాలు మైక్రోమ్యాక్స్ నుంచే జరిగాయి. 13.3% అమ్మకాలతో సామ్‌సంగ్ రెండో స్థానంలో నిలిచింది. 12.3% ఆపిల్ మూడో స్థానంలో నిలిచింది.

రేపే...మైక్రోమ్యాక్స్ కొత్త టాబ్లెట్ ఆవిష్కరణ:

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల అమ్మకాల్లో భాగంగా దేశీయంగా దూసుకుపోతున్న మైక్రోమ్యాక్స్ మరో కొత్త ఆవిష్కరణకు ముస్తాబవుతోంది. మైక్రోమ్యాక్స్ ‘ఫన్‌బుక్ టాక్ పీ350’ పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని మంగళవారం బ్రాండ్ ఆవిష్కరించనుంది. ఢిల్లీ వేదికగా జరిగి ఈ కార్యక్రమం పట్ల మైక్రోమ్యాక్స్ అభిమానులు ఉత్సకతతో ఉన్నారు.

ఫన్‌బుక్ టాక్ పీ350 ఫీచర్లు:

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ప్రాసెసర్: 1గిగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్‌ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), రేర్ కెమెరా వ్యవస్థ లోపించింది,

మెమరీ: 4జీబి ఇంటర్నల్ ఫ్లాష్ స్టోరేజ్ , 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: వై-ఫై 802.11 b/g/n, జీపీఆర్ఎస్, మైక్రోయూఎస్బీ 2.0 పోర్ట్,

బ్యాటరీ: 2800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు ఖచ్చితంగా),

ఇతర ఫీచర్లు:

గూగుల్ ప్లే, మ్యూజిక్, పికాసా, యూట్యూబ్, డాక్యుమెంట్ వ్యూవర్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X