నా రేటు 8 వేలు.?

Posted By: Super

నా రేటు 8 వేలు.?

 

టాబ్లెట్ తయారీ కంపెనీలు ఇండియాకు క్యూ కడుతున్నాయి. వ్యాపారానికి అనువైన ప్రదేశం కావటంతో రోజుకో కొత్త టాబ్లెట్ మార్కెట్లో విడుదలవుతుంది. ప్రస్తుతం నెలకున్న పరిస్ధితుల్లో ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్ పీసీలకు ఎనలేని డిమాండ్ ఏర్పడిందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దేశంలోని మధ్య తరగతి మొబైల్ మార్కెట్‌ను కొల్లగొట్టిన మైక్రోమ్యాక్స్ తాజాగా టాబ్లెట్  కంప్యూటర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది.  మైక్రోమ్యాక్స్ P300 మోడల్‌లో ఓ టాబ్లెట్ పీసీని ఈ కంపెనీ వ్ళద్ది చేసింది.  ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ పనిచేస్తుంది. ఇంతకీ ధర ఎంతో తెలుసా రూ.8,000. సంవత్సరం వారంటీ కూడా....

టాబ్లెట్ ప్రధాన ఫీచర్లు:

* 7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

*   ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,

*   3జీ కనెక్టువిటీ,

*   0.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్,

*   అంతరాయంలేని 4 గంటల బ్యాటరీ లైఫ్,

*   512 ఎంబీ ర్యామ్,

*   4జీబి ఇంటర్నల్ మెమెరీ,

*   32జీబి ఎక్సటర్నల్ మెమెరీ,

*   ఆడియో మరియు వీడియో ప్లేయర్,

*   హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్.

ప్రాసెసర్‌కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయి కంప్యూటింగ్ విలువలతో డిజైన్ కాబడిన మైక్రోమ్యాక్స్ P300 తక్కువ వ్యయంతో  టాబ్లెట్ కోనుగోలు చేద్దామనుకునే వారికి ఉత్తమ ఛాయిస్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot