Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
YS Jagan : వైఎస్ జగన్ ను తిట్టిన కానిస్టేబుల్ కు జగ్గయ్యపేట కోర్టు బెయిల్..
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Sports
చంపేస్తామంటూ దీపక్ చాహర్ భార్యకు బెదిరింపులు!
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మైక్రోసాఫ్ట్ నుంచి రూ. 12 వేలకే విండోస్ 10 ల్యాప్‌టాప్
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ నుంచి అతి త్వరలో అత్యంత తక్కువ ధరకే ల్యాపీ దూసుకురానుంది. లెనోవో, జేపీ సంస్థలతో కలిసి మైక్రోసాఫ్ట్ అతి త్వరలోనే రూ.12వేల ప్రారంభ ధరలో విండోస్ 10, విండోస్ 10 ఎస్ పేరిట విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ ల్యాప్‌టాప్‌లను అందివ్వనుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లలో వారికి పనికొచ్చే ఆఫీస్ 365 ఎడ్యుకేషన్ సాఫ్ట్‌వేర్, స్టెమ్ లెర్నింగ్, ఇతర వీడియో టూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

లెనోవో సంస్థ 100ఇ, 300ఇ
లెనోవో సంస్థ 100ఇ, 300ఇ 2 ఇన్ 1 పేరిట రెండు ఎడ్యుకేషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనుండగా వీటిల్లో ఇంటెల్ సెలెరాన్ ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్, 11.6 ఇంచ్ డిస్‌ప్లే, 2/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ కెమెరా, 10 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

జేపీ సంస్థ క్లాస్‌మేట్ లీప్ టి303..
అలాగే జేపీ సంస్థ క్లాస్‌మేట్ లీప్ టి303, ట్రిగోనో వీ401 2 ఇన్ 1 పేరిట పెన్, టచ్ సపోర్ట్ ఉండే విధంగా రెండు ఎడ్యుకేషన్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనుంది. ఈ నాలుగు ల్యాప్‌టాప్‌లలోనూ విండోస్ 10 స్టూడెంట్ ఎడిషన్ ఓఎస్‌ను అందివ్వనున్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌లు మార్కెట్‌లోకి ఎప్పుడు వచ్చేది మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు.

లెనోవో తన నూతన 2 ఇన్ 1 ల్యాప్‌టాప్
కాగా లెనోవో తన నూతన 2 ఇన్ 1 ల్యాప్‌టాప్ 'యోగా 920 వైబ్స్'ను లిమిటెడ్ ఎడిషన్ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా రూ.1,27,150 ధరకు ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు లభిస్తున్నది.

13.9 ఇంచ్ యూహెచ్‌డీ ఐపీఎస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే
ఇందులో 13.9 ఇంచ్ యూహెచ్‌డీ ఐపీఎస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ, డాల్బీ అట్మోస్, విండోస్ 10 హోమ్ ఓఎస్, 720పి హెచ్‌డీ వెబ్ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, 10 గంటల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

గూగుల్ పిక్సల్ బుక్
గతేడాది గూగుల్ ఈ ల్యాపీని లాంచ్ చేసింది. దీన్ని ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీగా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఇందులో 12.3 ఇంచ్ డిస్‌ప్లే, 2400 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, 8/16 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ వెబ్‌క్యామ్, క్రోమ్ ఓఎస్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 4కె డిస్‌ప్లే అవుట్‌పుట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.65వేల ప్రారంభ ధరకు ఈ ల్యాప్‌టాప్ ఈ నెల 31వ తేదీ నుంచి లభ్యం కానుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470