కొత్త హంగులతో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 అప్‌డేట్

Written By:

ప్రపంచ ఐటీ రంగంలో దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్ 10 అప్‌డేట్ వెర్షన్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. మైక్రోసాప్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల విండోస్ 10 యానివర్సరీ అప్‌డేట్ పేరుతో డెవలప్ చేసిన ఈ కొత్త ఆపరేటింగ్‌ను వేలమంది డెవలపర్ల మధ్య ఆవిష్కరించారు. ఈ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే పరికరాలతో మన చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడినంత సహజంగా మాట్లాడుతూ వాటితో మనం పనులు చేసుకోవచ్చని సత్య నాదెళ్ల చెప్పారు.

Read more: విండోస్ 10 ముఖ్యమైన అప్‌డేట్స్

కొత్త హంగులతో మైక్రోసాఫ్ట్ విండోస్ 10 అప్‌డేట్

మనుషుల భాషా సామర్థ్యాన్ని ఈ టెక్నాలజీ యంత్రాల మేధో సంపత్తితో సమ్మిళితం చేయాలన్నదే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. ఈ యానివర్సరీ అప్ డేట్ సమ్మర్ లో అందరికీ అందుబాటులోకి వచ్చేఅవకాశం ఉంది. ఈ యానివర్సరీ వర్షన్ తో మీరు యాప్స్ ను హల్లో అంటూ ఓపెన్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అలాగే పెన్‌తో మీరు పేపర్ మీద ఎలా రాస్తారో అలానే విండోస్ 10 మీద కూడా రాసుకునే కొత్త సౌకర్యం ఈ అప్‌డేట్ వర్షన్‌లో రానుంది. అంతే కాకుండా ఈ వెర్షన్ ద్వారా కార్టానా పేరుతో మీకు 1000 యాప్స్ అందుబాటులో ఉంటాయి.

Read more : విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

మీకు టాస్క్ బార్ మీదనే సెర్చ్ ఆప్సన్ ఉంటుంది. దీని సహాయంతో ప్రతి రోజూ మీరు మీకు సంబంధించిన వాటిని వెతుక్కోవచ్చు. మీకు ఎటువంటి అంతరాయం కలిగినా దాన్ని మీకు పేజీలో చూపించదు.అమిత వేగంతో మీకు సమాచారాన్ని అందిస్తుంది. మీరు మీ మొబైల్ తో అనుసంధానం కావలిసిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ఆండ్రాయిడ్ బేటా వర్షన్ లీక్ అయింది కూడా .

 

 

2

మైక్రో సాఫ్ట్ 8 లో ఓన్లీ స్లార్ట్ మెనూ మాత్రమే రిలీజ్ అయింది. అయితే గో టూ మెను కు బదులుగారీ స్టార్ట్ స్కీన్ ను ప్రవేశ పెట్టారు.ఇప్పుడొస్తున్న ఫ్లాట్ పాం చాలా బెటర్ గా డిజైన్ చేశారు. ప్రత్యేకమైన ఫీచర్స్ ని ప్రవేశపెట్టారు. వాతావరణానికి సంబంధించిన రిపోర్ట్ దానికదే అప్ డేట్ అవుతుంది.దానికోసం నీవు క్లిక్ చేయనక్కరలేదు.

3

విండోస్ 10 కొత్త కొత్త గా తయారు చేశారు. నీ పాస్ వర్డ్ టైప్ చేయకుండానే లాగాన్ కావచ్చు. మైక్రోసాఫ్ట్ డిజిటల్ కెమెరాతో ఆటోమేటిక్ గా సిస్థం ఓపెన్ అవుతుంది. దాని కోసం ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ హల్లో అనే అనే సెక్యూరిటీని రూపొందించారు.

 

 

4

విండోస్ 10 ఓన్లీ సిస్టం కోసమే కాదు. అందులో మీకు నచ్చిన గేమ్స్ ని డైరక్ట్ గా ఆడుకోవచ్చు. కంప్యూటర్ లో దీనికోసం ప్రత్యేకంగా గేమ్ జోన్ ని రూపొందించారు.

 

 

5

విండోస్ 10లో కొత్తగా ఎడ్జ్ ని ప్రవేశ పెట్టారు. ఇది కొత్త బ్రౌజర్. ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోర్ ,క్రోమ్ బ్రౌజర్ కన్నా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఆపిల్ జెట్ స్కీం బెంచ్ మార్క్ కన్నా 37 శాతం ఎక్కువ స్పీడ్ తో పని చేస్తుంది.

 

 

6

కొత్తగా విండోస్ 10లో డెస్క్ టాప్ కి ట్యాబ్లెట్ లాగా మార్చుకోవచ్చు. 2 ఇన్ వన్ అన్నమాట. ఇది రెండు విధాలుగా వాడుకోవచ్చు. అధునాతనమైన కీ బోర్డ్ తో ట్యాబ్లెట్ లాగా మార్చేచుకోవచ్చు.

 

 

7

ఇప్పుడున్న డెస్క్ టాప్ లలో ఒక డెస్క్ టాప్ ఓపెన్ చేసిన తరువాత మరొక డెస్క్ టాప్ లోకి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందే కదా..అయితే అటువంటి ఇబ్బంది మీకు విండోస్ 10లో కలుగదు.ఎందుకంటే యూజర్స్ కోసం ఎన్ని డెస్క్ టాప్ లైనా క్రియేట్ చేసుకోవచ్చు. వర్క్ కోసం ఒకటి, నాన్ వర్క్ కోసం మరొకటి ఇలా మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు న్యూ డెస్క్ టాప్ బటన్ క్లిక్ చేస్తే చాలు.

 

 

8

కొత్తగా వస్తున్న విండోస్ 10 అమిత వేగంతో పని చేస్తుంది. అంతే కాకుంగా కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తెస్తోంది. ఈ కొత్త డెస్క్ టాప్ కి ప్రత్యేకంగా మీరు డబ్బులు చెల్లించనవసరం లేదు. ఇప్పటికే విండోస్ 7, 8 తో లైసెన్స్ పొందిన వారికి విండోస్ 10 అప్ గ్రేడ్ అనేది ప్రీగా మీకు వస్తోంది.

9

విండోస్ 10.. ఐదు బెస్ట్, వరస్ట్ ఫీచర్లు..మరింత సమాచారం కొరకు క్లిక్ చేయండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Microsoft announces Windows 10 anniversary update, coming for free this summer
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot