మైక్రోసాఫ్ట్ సీఈఓ రేసులో మరో భారతీయుడు

Posted By:

మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి తెలుగు తేజం సత్య నాదెళ్ల ఎంపిక కాగలరని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అదే పదవికి మరో భారతీయుడు కూడా పోటీలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓ రేసులో భారత సంతతికి చెందిన సుందర్ పిచై (sundar pichai) కూడా ఉన్నట్లు ప్రముఖ మీడియా వెబ్‌సైట్ ‘సిలికాన్ యాంగిల్' పేర్కొంది.

మైక్రోసాఫ్ట్ సీఈఓ రేసులో మరో భారతీయుడు

మైక్రోసాఫ్ట్ సీఈఓ పదవికి సంబంధించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 42 సంవత్సరాల సుందర్ పిచై గూగుల్ కంపెనీలో 2004లో చేరారు. ప్రసుత్తం ఆండ్రాయిడ్, క్రోమ్ యాప్స్ విభాగాలకు పిచై సీనియర్ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సందుర్ పిచై టెక్నాలజీ విద్యలో పట్టభద్రులయ్యారు. ఆ తరువాత  స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

మరోవైపు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ పదవికి మన తెలుగు వ్యక్తిని ఎంపిక చేస్తున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ నియామకానికి సంబంధించి గత 5 నెలలగా కసరత్తులు జరుగుతున్న విషయం తెలుసిందే. 

ఈ నేపధ్యంలో హైదరబాదీ సత్య నాదెళ్ల (46) సీఈఓగా నియామకం చేసే అవకాశముందని అమెరికా మీడియా పేర్కొంది. ఈ నియామకం ఖరారైనట్లయితే మైక్రోసాఫ్ట్ కంపెనీ మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల చరిత్రలో నిలుస్తారు.

ప్రస్తుతం సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌండ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వెస్‌‌ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ తాను రిటైర్ కావాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ కోసం వెతుకులాట ప్రారంభించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot