స్కూల్ పిల్లల కోసం మైక్రోసాఫ్ట్ వితరణ!
అమెరికా విద్యార్థులకు హైస్పీడ్ ఇంటర్నెట్ ఇంకా అత్యాధునిక సాంకేతిక విద్యను సమకూర్చే లక్ష్యంతో ఆ దేశ అధ్యక్షడు ఏర్పాటు చేసిన ConnectED initiative కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ 1బిలియన్ డాలర్లను డొనేషన్ గా ఇవ్వనుంది.

విద్యార్థులకు ఈ వితరణ మరింతగా తోడ్పడనుంది. సాంకేతిక విద్యను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెమెరాన్ ఇవాన్స్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయం అమెరికా స్కూళ్లలో కొత్త మార్పును తీసుకురానుంది. ఈ వితరణ కార్యక్రమంలో భాగంగా ఏసర్, అసుస్, డెల్, హెచ్ పి, తొషీబా వంటి కంప్యూటర్ తయారీ కంపెనీలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదర్చుకుని 300 డాలర్ల పరిధిలో విద్యార్థులకు కంప్యూటర్లను మంజూరు చేయనుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications