విండోస్ 7 త్వరలో కనమరుగు!

Posted By:

విండోస్ 7 త్వరలో కనమరుగు!

విండోస్ ఎక్స్‌పి తరహాలోనే విండోస్7 ఆపరేటింగ్ సిస్టం సేవలు భవిష్యత్‌లో నిలిచిపోనున్నాయి. జనవరి 13, 2015 నుంచి విండోస్ 7 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి మెయిన్‌స్ట్రీమ్ సపోర్ట్ (Mainstream Support)ను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ మంగళవారం తన సపోర్ట్ వెబ్‌సైట్‌లో ఓకథనాన్ని ప్రచురించింది. అయితే, జనవరి 14, 2020 వరకు పొడిగించబడిన సపోర్ట్ (Extended Support) పై విండోస్7 అందుబాటులో ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

విండోస్7కు అప్‌గ్రేడెడ్ వర్సన్‌గా విడుదలైన విండోస్8 ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. త్వరలో విండోస్‌8కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విండోస్ 9ను మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకురానుంది. విండోస్ 7 తరహాలోనే మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన విండోస్ సర్వర్ 2008, ఎక్స్‌ఛేంజ్ సర్వర్ 2010లకు జనవరి 13, 2015 నుంచి మెయిన్‌స్ట్రీమ్ సపోర్ట్ సేవలను మైక్రోసాఫ్ట్ నిలిపివేయనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot