ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 10’
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ యూవత్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ‘విండోస్ 10' ఆపరేటింగ్ సిస్టంను మంగళవారం (సెప్టంబర్ 30న) శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా కార్యక్రమంలో విడుదల చేసింది. ప్రస్తుతమున్న విండోస్ 8కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విండోస్ 9 వర్షన్ వస్తుందని అంతా ఎదురు చూస్తున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ ఏకంగా విండోస్ 10ను ప్రదర్శించి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది.

ఈ సరికొత్త విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు... ఇలా అన్నింటికి ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. విండోస్ 8కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా రూపకల్పన చేయబడిన విండోస్ 10 ఇప్పటి వరకు తాము విడదల చేసిన ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో అత్యుత్తమంగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ టెర్రీ మైర్సన్ తెలిపారు.
రెండు సంవత్సరాల క్రితం విడుదలైన విండోస్8కు వినియోగదారుల నుంచి అంతగా ఆదరణ లభించలేదు. ఫేలవమైన టాక్‌ను సొంతం చేసకున్న విండోస్8ను కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే ఉపయోగిస్తున్నాయని సాంకేతిక అంశాల పరిశోధన సంస్థ ఫారెస్టర్ తెలిపింది. విండోస్ 8 ఇంటర్‌ఫేస్‌లో స్టార్ట్ బటన్ పాపప్ మెనూ లేకపోవటం పలువురిని నిరాశకు గురి చేసింది. సరికొత్త స్టార్ట్ మెనూ, యూనివర్సల్ సెర్చ్ తదితర అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్నమైక్రోసాఫ్ట్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10' 2015లో అందుబాటులోకి వస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








