క్వాల్కమ్ చిప్‌సెట్‌లతో మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్‌లు, 20 గంటల బ్యాటరీ లైఫ్!

Posted By: BOMMU SIVANJANEYULU

హవాయిలో జరుగతోన్న క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ టెక్ సమ్మిట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచపు మొట్టమొదటి 'ఆల్వేస్ కనెక్టెడ్’ పీసీలను అనౌన్స్ చేసింది. ఆర్మ్ బేసిడ్ క్వాల్కమ్ చిప్‌సెట్‌లతో వచ్చే ఈ పీసీలు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

క్వాల్కమ్ చిప్‌సెట్‌లతో మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్‌లు, 20 గంటల బ్యాటరీ

ఈ సమ్మిట్‌లో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (విండోస్ అండ్ డివైసెస్ గ్రూప్ విభాగం) టెర్రీ మైర్సన్... ఆసుస్ (Asus), హెచ్‌పీ (HP)లు భాగస్వామ్యంతో తయారు చేసిన ఆల్వేస్ కనెక్టెడ్ పీసీలను ప్రపంచానికి పరిచయం చేసారు. Asus NovaGo, HP ENVY x2 మోడల్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. త్వరలో లెనోవో భాగస్వామ్యంతోనూ ఈ తరహా పీసీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైర్సన్ తెలిపారు.

ఈ సరికొత్త ల్యాప్‌టాప్‌లు బిల్ట్-ఇన్ ఎల్టీఈ కనెక్టువిటీతో రావటంతో పాటు ఎక్స్86 పీసీలతో పోలిస్తే లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తాయని లాంచ్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. భవిష్యత్ కంప్యూటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని తాము అభివృద్ధి చేసిన ఆల్వేస్ కనెక్టెెడ్ పీసీలు టెక్నాలజీ ఇండస్ట్రీలో తరువాతి బిగ్ థింగ్‌గా అవతరించనున్నాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

ఇదే కార్యక్రమంలో భాగంగా క్వాల్కమ్‌తో కుదర్చుకున్న ఒప్పంద వివరాలను కూడా మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. గతంలో ఎక్స్86 చిప్‌సెట్‌ల తయారీ నిమిత్తం ఇంటెల్, ఏఎమ్‌డిలతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదర్చుకున్న విషయం తెలిసిందే.

క్వాల్కమ్ చిప్‌సెట్‌లతో మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్‌లు, 20 గంటల బ్యాటరీ

ఆసుస్ నోవాగో (Asus NovaGo) ప్రత్యేకతలు..

ఆసుస్ నోవాగో ప్రపంచపు మొట్టమొదటి Gigabit LTE ల్యాప్‌టాప్‌గా అవతరించబోతోంది. క్వాల్కమ్
స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ పీపీ ప్లాట్‌ఫామ్ పై రన్ అయ్యే ఈ ల్యాపీలో అత్యాధునిక ఎక్స్16 ఎల్టీఈ
మోడెమ్‌ను నిక్షిప్తం చేసారు. దీంతో ఈ డివైస్ సూపర్ ఫాస్ట్ డౌన్‌లోడ్ స్పీడ్‌లను అందుకోగలుగుతుంది. 2 గంటల సినిమాను కేవలం 10 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ ల్యాపీలో పొందుపరిచిన బ్యాటరీ 30 రోజుల స్టాండ్ బై టైమ్‌తో పాటు 22 గంటల యాక్టివ్ యూజ్‌కు ఉపకరిస్తుంది.

జనవరి 8న హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్, ఇండియాలో గ్రాండ్ ఈవెంట్

స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 మొబైల్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 8జీబి), యూనివర్శల్ ఫ్లాష్ స్టోరేజ్ (64జీబి, 128జీబి, 256జీబి) వేరియంట్స్, యూఎస్బీ 3.0 జెనరేషన్ 1 టైప్-ఏ పోర్ట్స్, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, స్పెషల్ ఫీచర్స్ (విండోస్ ఇంక్, విండోస్ హల్లో, విండో కార్టోనా), ల్యాపీ బరువు 1.39 కిలో గ్రాములు, చుట్టుకొలత 316 x 221.6 x 14.9 మిల్లీ మీటర్లు, ఈ-సిమ్ ఇంకా నానో-సిమ్ ఆప్షన్స్.

క్వాల్కమ్ చిప్‌సెట్‌లతో మైక్రోసాఫ్ట్ ల్యాప్‌టాప్‌లు, 20 గంటల బ్యాటరీ


హెచ్‌పి ఎన్‌వి ఎక్స్2 (HP ENVY x2) ప్రత్యేకతలు...

ఈ ఆల్వేస్ కనెక్టెడ్ పీసీ ద్వారా విండోస్ ల్యాప్‌టాప్‌లోనే స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది. ఈ డ్యూరబుల్ ల్యాప్‌టాప్‌లో లైట్నింగ్ ఫాస్ట్ 4జీ ఎల్టీఈ2 చిప్‌ను ఏర్పాటు చేసారు. దీంతో వేగవంతమైన కనెక్టువిటీని ఆస్వాదించే వీలుంటుంది. ఈ ల్యాపీలో పొందుపరిచిన బ్యాటరీ 20 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.

ధరలు ఎంతెంత..?

యూఎస్ మార్కెట్లో ఆసుస్ నోవాగో 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ మోడల్ ధర $499గా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.32,143. 8జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ మోడల్ ధర $799గా ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.51,467. మార్కెట్లో వీటి అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. హెచ్‌పి ఎన్‌వి ఎక్స్2 ల్యాప్‌టాప్ ధర రివీల్ కావల్సి ఉంది.

English summary
Microsoft is touting the new Always Connected PCs to be the next big revolution in the tech industry after the original laptop and virtual reality.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot