ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో మైక్రోసాఫ్ట్ కీబోర్డ్

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సరికొత్త కీబోర్డ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. మోడ్రన్ కీబోర్డ్ పేరుతో పిలువబడుతోన్న ఈ కీబోర్డులో హిడెన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. బయోమెట్రిక్ టచ్ ఐడీ సౌకర్యం అందుబాటులో లేని పీసీల కోసం ఈ కీబోర్డ్‌ను అభివృద్ధి చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్కానర్ కీబోర్డ్ లోపల ఉంటుంది..

ఈ తరహా కీబోర్డులు ఇంతకు ముందే మార్కెట్లో లాంచ్ అయినప్పటికి వాటిలో ఫింగర్ ప్రింట్ స్కానర్ బయటకు కనిపించేస్తుంది. అయితే మైక్రోసాఫ్ట్ రూపొందించిన మోడ్రన్ కీబోర్డ్‌లో మాత్రం ఫింగర్ ప్రింట్ స్కానర్ కీబోర్డ్ లోపల ఉంటుంది.

ALT, MENU బటన్‌ల మధ్య..

ఈ స్కానర్‌ను ఆపరేట్ చేసుకునేందుకు ప్రత్యేకబైన బటన్‌ను మైక్రోసాఫ్ట్ ఈ కీబోర్డ్ పై ఏర్పాటు చేయటం జరిగింది. ALT, MENU బటన్‌ల మధ్య ఈ మెనూను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను యాక్టివేట్ చేయాలంటే యూజర్ ముందుగా తన వేలి ముద్రతో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఈ కీబోర్డ్ wired అలానే wireless వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

wired ఇంకా wireless మోడల్స్‌లో

ఈ కీబోర్డ్ wired అలానే wireless మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. వైర్‌లెస్ కీబోర్డ్‌ను Bluetooth 4.0 కనెక్టువిటీ స్టాండర్డ్ ద్వారా కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. 10 మీటర్ల దూరం నుంచి ఈ కీబోర్డ్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.

సింగిల్ ఛార్జ్ పై నాలుగు నెలల పాటు వాడుకోవచ్చు...

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఈ వైర్‌లెస్ కీబోర్డ్‌ను ఒక్కసారి గనుక ఛార్జ్ చేసినట్లయితే 4 నెలలపాటు వాడుకోవచ్చు. అల్యుమినియమ్ ఫ్రేమ్‌తో వస్తోన్న ఈ కీబోర్డ్ మొదటి లుక్‌లోనే ప్రీమియమ్ లుక్‌ను కలిగిస్తుంది. ఈ కీబోర్డ్ అందరికి సూట్ అవుతుంది. చైనా మార్కెట్లో ఈ కీబోర్డ్ ధరను 145 డాలర్లుగా నిర్ణయించారు. యూఎస్ మార్కెట్లో 129.99 డాలర్లుగా ఉంది. ఈ కీబోర్డ్ కేవలం విండోస్ 10 పై రన్ అయ్యే కంప్యూటర్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Microsoft's newly launched Modern Keyboard features a fingerprint scanner key. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot