Home
Computer

భారీ ధరతో సర్ఫేస్ బుక్ 2 సీరిస్ ల్యాపీలు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 'సర్ఫేస్ బుక్ 2' సిరీస్‌లో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను తాజాగా విడుదల చేసింది.

By Hazarath

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 'సర్ఫేస్ బుక్ 2' సిరీస్‌లో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను తాజాగా విడుదల చేసింది. 13.5 ఇంచ్, 15 ఇంచ్ డిస్‌ప్లే వేరియెంట్లలో సర్ఫేస్ బుక్ 2 వినియోగదారులకు లభిస్తున్నది. Windows 10 Fall Creators Update తో ఈ ల్యాపీలు వినియోగదారులను అలరించనున్నాయి.

Microsoft Surface Book 2

అయితే ఇవి యుఎస్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్కడ నవంబర్ 7 నుంచి ఈ ల్యాపీల బుకింగ్ స్టార్టవుతాయి. నవంబర్ 16 నుంచి యూజర్లకు డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే ఇండియాకి ఇవి ఎప్పుడు వస్తాయనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Microsoft Surface Book 2

13.5 ఇంచ్ సర్ఫేస్ బుక్ 2లో 13.5 ఇంచ్ డిస్‌ప్లే, 3000 x 2000 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ 7వ జనరేషన్ కోర్ ఐ5 లేదా ఐ7 ప్రాసెసర్, 8/16 జీబీ ర్యామ్, 256 జీబీ/512 జీబీ/1 టీబీ ఎస్‌ఎస్‌డీ, 2 జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.97వేలు.

Microsoft Surface Book 2

15 ఇంచుల సర్ఫేస్ బుక్ 2 ల్యాప్‌టాప్‌లో 15 ఇంచ్ డిస్‌ప్లే, 3240 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, 6 జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, 16 జీబీ ర్యామ్, 256 జీబీ/512 జీబీ/1 టీబీ ఎస్‌ఎస్‌డీ, 17 గంటల బ్యాటరీ బ్యాకప్, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1.62 లక్షలు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ ల్యాప్‌టాప్‌లు వినియోగదారులకు మార్కెట్‌లో లభించనున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Microsoft Surface Book 2 With Eighth Generation Intel Core Processors Launched: Price, Specifications more News At Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X