బ్యాటరీ వీక్?

సాఫ్ల్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ల్ ఇటీవల ప్రకటించిన సర్‌ఫేస్ టాబ్లెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ సరికొత్త టాబ్లెట్ పీసీలకు సంబంధించి అనేక కీలక స్పెసిఫికేషన్లను మైక్రోసాఫ్ట్ వర్గాలు బహిర్గతం చేసాయి. రెండు వర్షన్‌లలో విడుదలవుతున్నఈ డివైజ్‌లలో సర్‌ఫేస్ ఆర్‌టి వర్షన్, ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు పోటీగా నిలవనుంది. ఆపిల్ ఐప్యాడ్‌తో పోలిస్తే బ్యాటరీ విషయంలో సర్‌ఫేస్ ఆర్‌టి తక్కువ శక్తిని కలిగి ఉంటుందని కంప్యూటర్ వరల్డ్ విశ్లేషిస్తుంది. మైక్రోసాఫ్ట్ సైట్‌లో పొందుపరిచిన స్పెసిఫికేషన్‌ల మేరకు విండోస్ ఆర్‌టి వర్షన్ సర్‌ఫేస్ టాబ్లెట్ 31.4వాట్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ పై రన్ అవుతుంది. ఆపిల్ కొత్త ఐప్యాడ్ 42.5వాట్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ పై రన్ అవుతంది. వీటి బ్యాకప్‌లను పరిశీలిస్తే విండస్ ఆర్‌టిలో పొందుపరిచిన 31.4వాట్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ 7 గంటల బ్యాకప్‌నిస్తుంది. 42.5వాట్ బ్యాటరీని కలిగిన ఆపిల్ కొత్త ఐప్యాడ్ 10 గంటల సుధీర్ఘ బ్యాకప్‌నిస్తుంది.
మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఆర్‌టి ఫీచర్లు:
10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,
.37మిల్లీమీటర్ల మందం,
676 గ్రాముల బరువు,
విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం,
స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,
పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),
ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్,
ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.
ఆపిల్ కొత్త ఐప్యాడ్ ఫీచర్లు:
9.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,
.37 మిల్లీమీటర్ల మందం,
1.44 పౌండ్ల బరువు,
ఐవోఎస్ 5 ఆపరేటింగ్ సిస్టం,
స్టోరేజ్ సామర్ధ్యం 16 జీబి,32జీబి, 64జీబి,
10 పిన్ పోర్ట్స్,
ఆపిల్ ఏ5ఎక్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.30,500.


Click it and Unblock the Notifications