ఆపిల్ పై మైక్రోసాఫ్ట్ నెగ్గుతుందా..?

Posted By: Prashanth

ఆపిల్ పై మైక్రోసాఫ్ట్ నెగ్గుతుందా..?

 

సోమవారం లాస్‌యాంగిల్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ రెండు సరికొత్త విండోస్ 8 ఆధారిత టాబ్లెట్ పీసీలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. వీటిలో తక్కువ బరువు కలిగి స్లిమ్ వేరింయట్‌లో రూపుదిద్దుకున్న టాబ్లెట్‌ను ఆపిల్ కొత్త ఐప్యాడ్‌కు పోటీగా మైక్రోసాఫ్ట్ రూపొందించింది. గత మార్చిలో విడుదలైన ఆపిల్ కొత్త ఐప్యాడ్ ఉత్తమ గ్యాడ్జెట్ గా గుర్తింపుతెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రెండు టాబ్లెట్ల ఫీచర్లను పరిశీలిద్దాం..

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్ ( విండోస ఆర్ టీ వర్షన్):

10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,

.37మిల్లీమీటర్ల మందం,

676 గ్రాముల బరువు,

విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం,

స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,

పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్,

ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

ఆపిల్ కొత్త ఐప్యాడ్:

9.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే,

.37 మిల్లీమీటర్ల మందం,

1.44 పౌండ్ల బరువు,

ఐవోఎస్ 5 ఆపరేటింగ్ సిస్టం,

స్టోరేజ్ సామర్ధ్యం 16 జీబి,32జీబి, 64జీబి,

10 పిన్ పోర్ట్స్,

ఆపిల్ ఏ5ఎక్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ధర రూ.30,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot