ధర వింటే దడే?

By Prashanth
|
Microsoft


టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్లో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్’ మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ డివైజ్ ధరకు సంబంధించి వెబ్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ రూమర్ మైక్రోసాఫ్ట్ అభిమానులను కలవరపాటకు లోను చేస్తుంది. ఆపిల్ ఆధిపత్యానికి గండి కొట్టే ప్రయత్నంగా రూపుదిద్దుకున్న ‘సర్‌ఫేస్ టాబ్లెట్’రెండు వర్షన్ లలో విడుదల కాబోతుంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, సర్‌ఫేస్ టాబ్లెట్ బేస్ మోడల్ ధర $1,000, ఆడ్వాన్సుడ్ వర్షన్ ధర $2,150 (ఇండియన్ మార్కెట్ ధర రూ.1,20,000). ఈ ధరను మైక్రోసాఫ్ట్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇదే నిజమైతే.. మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్ కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమవుతుంది.

సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టి ఫీచర్లు:

* విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టం,

* 9.3 మిల్లీమీటర్ల మందం, 676 గ్రాముల బరువు,

* 10.6 అంగుళాల క్లియర్ హై డెఫినిషన్ డిస్‌ప్లే,

* ఎన్-విడియా చిప్,

* ఆఫీస్ ‘15’ అప్లికేషన్స్,

* పోర్ట్స్ (మైక్రోఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో,

* టచ్‌కవర్, టైప్‌కవర్,

* మెమరీ వేరియంట్స్ 32జీబి, 64 జీబి.

సర్‌ఫేస్ విండోస్ 8 ప్రో:

* విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం,

* 13.5 మిల్టీ మీటర్ల మందం, 903 గ్రాముల బరువు,

* 10.6 అంగుళాల క్లియర్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

* పోర్ట్స్ ( మైక్రోఎస్డీఎక్స్ సీ, యూఎస్బీ 3.0, మినీ డిస్ ప్లే పోర్టు వీడియో),

* టచ్‌కవర్, టైప్‌కవర్, పెన్ విత్ పామ్ బ్లాక్,

* మెమరీ వేరియంట్స్ 64జీబి, 128జీబి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X