వెలుగులోకి మరిన్ని వివరాలు..?

Posted By: Super

వెలుగులోకి మరిన్ని వివరాలు..?

 

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సొంత హార్డ్‌వేర్ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘సర్‌ఫేస్ టాబ్లెట్’లు ప్రకటించబడిన కొద్ది కాలంలోనే ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ టాబ్లెట్‌లలో ఒకటి ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా నిలవనున్న నేపధ్యంలో, ఏ గ్యాడ్జెట్ స్టోర్‌లో చూసినా  వీటి గురించే వాడివేడిగా చర్చించుకుంటున్నారు. విండోస్ ఆర్‌టి,  విండోస్ 8 ప్రో వర్షన్‌లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ పీసీల ధరలను మైక్రోసాఫ్ట్ వర్గాలు గోప్యంగా ఉంచాయి. ప్రముఖ టెక్ పోర్టల్  ‘డిగీటైమ్స్’ వీటి ధరలను తెలుసుకునే ప్రయత్నంలో  పలు వివరాలను సేకరించింది. వాటి ఆధారంగా విండోస్ ఆర్ టి వర్షన్  ధర రూ.33,800. విండోస్ ప్రో వర్షన్ ధరను రూ.45,000లుగా  తెలుస్తోంది.

సర్‌ఫేస్ విండోస్ ఆర్‌టి ఫీచర్లు:

* విండోస్ ఆర్‌టి ఆపరేటింగ్ సిస్టం,

* 9.3 మిల్లీమీటర్ల మందం, 676 గ్రాముల బరువు,

* 10.6 అంగుళాల క్లియర్ హై డెఫినిషన్ డిస్‌ప్లే,

* ఎన్-విడియా చిప్,

* ఆఫీస్ ‘15’ అప్లికేషన్స్,

* పోర్ట్స్ (మైక్రోఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో,

* టచ్‌కవర్, టైప్‌కవర్,

* మెమరీ వేరియంట్స్ 32జీబి, 64 జీబి.

సర్‌ఫేస్ విండోస్ 8 ప్రో:

* విండోస్ 8 ప్రో ఆపరేటింగ్ సిస్టం,

* 13.5 మిల్టీ మీటర్ల మందం, 903 గ్రాముల బరువు,

* 10.6 అంగుళాల క్లియర్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

* పోర్ట్స్ ( మైక్రోఎస్డీఎక్స్ సీ, యూఎస్బీ 3.0, మినీ డిస్ ప్లే పోర్టు వీడియో),

* టచ్‌కవర్, టైప్‌కవర్, పెన్ విత్ పామ్ బ్లాక్,

* మెమరీ వేరియంట్స్ 64జీబి, 128జీబి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot