మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ .. గూగుల్ ఇరకాటంలో పడుతుందా..?

Posted By: Staff

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ .. గూగుల్ ఇరకాటంలో పడుతుందా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ల్ గడచిన జూన్‌లో ప్రకటించిన సర్‌ఫేస్ టాబ్లెట్ పీసీలు టెక్ ప్రపచంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. విండోస్ 8 అదేవిధంగా విండోస్ ఆర్‌టీ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం‌ల పై స్పందించే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు విడుదలకు మందే విశ్వవ్యాప్తంగా అనూహ్యమైన డిమాండ్‌ను మూటగట్టుకున్నాయి. విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ టాబ్లెట్ చవక ధరైన రూ.11,000లకే అందుబాటులోకి. ఈ ధర ఇంచుమించుగా గూగుల్ నెక్సస్‌కు దగ్గర.

అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన విండోస్ సర్‌ఫేస్ టాబ్లెట్‌లు రూ.11,000 ధరకు లభ్యంకావటం సాధ్యంకాదనే భావనను పలువురు టెక్ కోవిదులు వ్యక్తం చేస్తున్నారు. ఈ టాబ్లెట్‌ల ధరను మైక్రోసాఫ్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్ 26 నుంచి ఈ గ్యాడ్జెట్‌లు అందుబాటులోకి రానున్నాయి. రూమర్లు నిజమై రూ.11,000 ధరకే విండోస్ 8 మైక్రోసాఫ్ట్ టాబ్లెట్‌లు అందుబాటులోకి వస్తే గూగుల్ నెక్సస్ 7 అదేవిధంగా ఆమోజన్ కిండిల్ ఫైర్‌ల అమ్మకాలు గణనీయంగా తగ్గే ప్రమాదముంది.

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఆర్‌టి టాబ్లెట్ ఫీచర్లు:

10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,

.37మిల్లీమీటర్ల మందం,

676 గ్రాముల బరువు,

విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం,

స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,

పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్,

ధర ఇంకా విడుదల వివరాలు తెలియాల్సి ఉంది.

గూగుల్ నెక్సస్ 7 ఫీచర్లు:

గగూల్ నెక్సస్ 7:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

1.3గిగాహెట్జ్ టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసింగ్ యూనిట్,

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),

1.3 మెగా పిక్సల్ కెమెరా,

బరువు 0.75 పౌండ్లు,

బ్యాటరీ బ్యాకప్ (9.5గంటలు).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot