రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది!

By Prashanth
|
Microsoft Windows 8


సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ విడుదలచు సమయం దగ్గర పడుతోంది. వచ్చే అక్టోబర్ 26 నుంచి ఈ వోఎస్ లభ్యమవుతుంది. టొరంటోలో జరిగిన మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్టనర్ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలు బహిర్గతమయ్యాయు. విండోస్ 7 విడుదలైన మూడు సంవత్సరాల తరువాత విండోస్8 విడుదల కానుండటంతో మార్కెట్ వర్గాలు ఈ వోఎస్ పై భారీ అంచనాలు నెలకున్నాయి.

విండోస్ 8 ప్రపంచవ్యాప్తంగా 231 మార్కెట్లలో 109 భాషల్లో లభ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ సీఈవో స్టీవ్ బామర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టబోతున్న సర్ ఫేస్ ట్యాబ్లెట్ పీసీలలో విండోస్8ను వినియోగించనున్నారు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసులు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లన్నింటినీ ఈ వోఎస్ సపోర్ట్ చేస్తుంది.

మైక్రోసాఫ్ట్ సర్‌ఫేస్ ఆర్‌టి టాబ్లెట్ కంప్యూటర్ ఫీచర్లు:

10.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే,

.37మిల్లీమీటర్ల మందం,

676 గ్రాముల బరువు,

విండోస్ 8 ఆర్‌టి ఆపరేటింగ్ సిస్ట్ం,

స్టోరేజ్ సామర్ధ్యం 32జీబి, 64జీబి,

పోర్ట్స్ (మైక్రో ఎస్డీ, యూఎస్బీ 2.0, మైక్రో హైడెఫినిషన్ వీడియో, మిమో యాంటీనా),

ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసింగ్ యూనిట్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X