‘మైక్రో సాఫ్ట్’లో ఉద్యోగం దీ బెస్ట్!!!

Posted By: Staff

‘మైక్రో సాఫ్ట్’లో ఉద్యోగం దీ బెస్ట్!!!

మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేయ్యటమంటే ఉత్తమమైన విషయమని ‘గ్రేట్ ప్లేట్ టు వర్క్ ఇనిస్టిట్యూట్’ కన్సల్టెన్సీ సంస్థ కితాబిచ్చింది. ఉద్యోగం చేసేందుకు ఉత్తమమైన 25 బహుళజాతి (మల్టీ నేషనల్) కంపెనీల జాబితాను ఈ సంస్థ రూపొందించింది. జాబితాలో ప్రధమ స్థానాన్ని ‘మైక్రో సాఫ్ట్’ దక్కించుకోగా, ఇంటర్నెట్ రారాజు ‘గూగుల్’ నాల్గో స్థానంలో నిలిచింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ ‘ఎస్ఏఎస్’ రెండో స్థానంలో, నెట్ వర్క్ స్టోరేజ్ ప్రొవైడర్ ‘నెట్ యాప్’ మూడో స్థానాలతో ముందంజలో ఉన్నాయి.

ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం, స్నేహపూర్వక వాతావరణం, సేవాతత్పురత మొదలగు అంశాలను పెంపొందించటంలో ‘బహుళజాతి’ కంపెనీలు చేస్తున్న కృషిని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న ‘గ్రేట్ ప్లేట్ టు వర్క్ ఇనిస్టిట్యూట్’ ఈ సర్వేను నిర్వహించింది. అధ్యయనంలో భాగంగా 25 లక్షల మంది ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి ఫలితాలను వెలువరించినట్లు తెలుస్తోంది.

ఈ లిస్టలో వరుస పదిస్థానాలు అమెరికా కంపెనీలకు దక్కటం విశేషం. మరో విచారకర విషయమేమిటంటే జాబితాలో ఏ ఒక్క ఆసియా కంపెనీకి చోటు దక్కలేదు. టాప్ టెన్ ర్యాకింగ్స్ లో ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ (5), ఐటీ కంపెనీ సిస్కో (6), అతిథ్య రంగ సంస్థ మారియోట్ (7), మెక్ డొనాల్డ్ (8), గృహోపకరణాల తయారీ సంస్థ కింబర్లీ -క్లార్క్ (9), ఎస్ సీ జాన్సన్ (10) స్థానాల్లో నిలిచాయి. ప్రముఖ చిప్ తయారీ దారు ఇంటెల్ (14), యాక్సెంచెర్ (20), శీతలపానీయల కంపెనీ (23) ర్యాంకింగ్ తో జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting