మహిళా మణుల కోసం మొదటి టాబ్లెట్ పీసీ!!!

Posted By: Prashanth

మహిళా మణుల కోసం మొదటి టాబ్లెట్ పీసీ!!!

 

వివిధ రంగాల్లో పురుషులకు ధీటుగా రాణిస్తున్న మహిళామణుల కోసం ‘మిలాగ్రో’(Milagrow) సంస్థ టాబ్లెట్ కంప్యూటర్‌ను డిజైన్ చేసింది. రోజు వారి అవసరాలను మహిళలకు గుర్తు చేస్తూ, ఆ బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించేందుకు ‘మిలాగ్రో’ టాబ్లెట్ పీసీ దోహదపడుతుంది.

అప్‌ డేటెడ్ టెక్నికల్ స్సెసిఫికేషన్‌లను ఈ గ్యాడ్జెట్‌లో కాన్ఫిగర్ చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైజ్ రన్ అవుతుంది. శక్తివంతమైన 1.2GHz ప్రాసెసర్‌ను సిస్టంలో డిజైన్ చేశారు. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, 7 అంగుళాలు డిస్‌ప్లే టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంటుంది. డివైజ్ ఇంటర్నల్ స్టోరిజ్ 8జీబి, మైక్రో ఎస్డీ స్లాట్ విధానం ద్వారా జీబిని 32కు వృద్థి చేసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు.

Read In English

ఈ డివైజ్‌ను వై-ఫై మోడెమ్‌లా ఉపయోగించుకోవచ్చు తద్వరా ఒకే సారి 8 డివైజ్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవ్వచ్చు. వేగవంతమైన 3జీ ఇంటర్నెట్ వ్యవస్థను గ్యాడ్జెట్ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.15,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot