రూటు మార్చిన మిలాగ్రో!

Posted By: Super

రూటు మార్చిన మిలాగ్రో!

 

 

పలు ఆండ్రాయిడ్ ఆధారిత టాబ్లెట్‌లను మార్కెట్లో విజయవంతంగా ఆవిష్కరించిన మిలాగ్రో తాజాగా విండోస్ 7 టాబ్లెట్‌తో ముందుకొచ్చింది. పేరు కుపా ట్యాబ్‌టాప్ ఎక్స్ 11(Kupa Tab Top X11). యువవృత్తి నిపుణులతో వ్యాపారవేత్తలను టార్గెట్‌గా చేసుకుని ఈ డివైజ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

ప్రధాన ఫీచర్లు:

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

10 అంగుళాల మల్టీటచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366× 768పిక్సల్స్),

ఎలక్ట్రోమ్యాగ్నటిక్ డిజిటైజర్ ఇంకా డిజిటల్ ఇంక్‌పెన్,

ఎన్2600 డ్యూ కోర్ 1.6గిగాహెర్జ్ ప్రాసెసర్,

ఎస్‌జీ‌ఎక్స్535 పవర్ వీఆర్ కోర్  గ్రాఫిక్స్ ప్రాసెసర్,

2జీబి డీడీఆర్3 ర్యామ్,

మెమరీ స్టోరేజ్ వర్సన్స్ 64జీబి, 128జీబి,

4800ఎమ్ఏహెచ్/11.1V బ్యాటరీ (స్టాండ్‌బై టైమ్ 30 రోజులు, టాక్‌టైమ్ 10 గంటలు),

ఫ్రంట్ కెమెరా 1.3 మెగా పిక్సల్,

రేర్ కెమెరా  1.3 మెగాపిక్సల్,

మిలాగ్రో  ట్యాబ్‌టాప్ ఎక్స్ 11, 64జీబి వర్షన్ ధర రూ.54,990, 128జీబి వర్షన్ ధర రూ.66,990.

కీలకాంశాలు:

- మార్కెట్ అంతా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై ఆసక్తి చూపుతున్ననేపధ్యంలో  మిలాగ్రో విండోస్ 7 టాబ్లెట్‌తో  మార్కెట్లోకి రావటం నిజంగా సాహసోపేతమే?.

- ఇతర టాబ్లెట్‌లలోని బ్యాటరీ బ్యాకప్‌తో పోలిస్తే మిలాగ్రో విండోస్ 7 టాబ్లెట్ సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- బుల్ట్‌ఇన్ ఫింగర్ ఫ్రింట్ రీడర్, స్మూత్‌పెన్ ఇన్‌పుట్ వంటి వ్యవస్థలు డివైజ్ సెక్యూరిటీ ఇంకా పని వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot