క్వాలిటీ ఫీచర్లతో మిలాగ్రో టాబ్లెట్!

Posted By: Prashanth

క్వాలిటీ ఫీచర్లతో మిలాగ్రో టాబ్లెట్!

 

ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల నిర్మాణ సంస్థ మిలాగ్రో (Milagrow) తాజాగా సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో ముందుకొచ్చింది. పేరు మిలాగ్రో ట్యాబ్ టాప్ 10.4. ప్రస్తుతానికి ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలో 4.1 జెల్లీబీన్‌కు అప్‌డేట్ అయ్యే అవకాశముంది.

ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 780మెగా పిక్సల్స్), 1.2గిగాహెర్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి డీడీఆర్ ర్యామ్, వీవంటీ జీసీ 8003డీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై 802.11 b/g/n, 3జీ వయా డాంగిల్, 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ లిపో బ్యాటరీ (టాక్‌టైమ్ 12గంటలు, స్టాండ్‌బై 15 రోజులు).

సాఫ్ట్‌వేర్ ఫీచర్లు:

ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలను ఈ టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది. 60 భాషలకు సంబంధించి కీబోర్డ్ సపోర్ట్, ముందుగా ఇన్స్‌స్టాల్ చేసిన గూగుల్ మ్యాప్స్, గూగుల్ లాటిట్యూడ్, గూగుల్ ప్లేసెస్, ఆటోమేటిక్ స్ర్కీన్ కంట్రోలింగ్ వ్యవస్థ.

ధర వివరాలు:

మిలాగ్రో ట్యాబ్ టాప్ 10.4 మార్కెట్ ధర రూ.22,990. ధర కాస్తంత ఎక్కువుగా అనిపిస్తున్నప్పటికి ఫీచర్ల పరంగా ‘దిబెస్ట్’.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot