చిన్నదే కదా అని చులకనగా చూడొద్దు..?

Posted By: Super

చిన్నదే కదా అని చులకనగా చూడొద్దు..?

 

దేశీయ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ మిలాగ్రో (Milagrow) ఇండియన్ మార్కెట్లో సరికొత్త సంచలనాన్ని నమోదు చేుసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రూ.10,000 నుంచి 16,000 ధరల మధ్య వివిధ వేరియంట్‌లలో టాబ్లెట్ పీసీలను జూన్ నాటికి ఈ సంస్థ అందుబాటులోకి తేనుంది. విండోస్ మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ ఆధారితంగా ఇవి పని చేస్తాయి.

తమ పరిధిని మరింత విస్తరించుకునే నేపధ్యంలో క్వాలిటీతో కూడిన కంప్యూటింగ్ పరికరాలను సమంజసమైన ధరలకే అందించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ కర్వాల్ ఒ ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ చివరినాటికి  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే టాబ్లెట్ పీసీని లాంఛ్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. విండోస్ 7 ప్రీమియమ్ పై పనిచేసే మరో టాబ్లెట్ పీసీని జూన్‌లో అందుబాటులోకి తేనున్నట్లు రాజీవ్ స్పష్టం చేశారు. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన 4జిగాహెడ్జ్ ప్రాసెసర్, 128జీబి మెమరీ వ్యవస్థలు సమర్ధవంతమైన పనితీరునందిస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot