గూగుల్ గ్లాస్ కోసం మైండ్ కంట్రోల్ అప్లికేషన్

Posted By:

గూగుల్ అధునాతన టెక్నాలజీ ఉత్పత్తి ‘గూగుల్ గ్లాస్' కోసం సరికొత్త మైండ్ కంట్రోల్ అప్లికేషన్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ‘మైండ్ ఆర్‌డీఆర్' అనే ఈ అప్లికేషన్ ద్వారా గూగుల్ గ్లాస్‌కు మీ ఆలోచన శక్తి సాయంతోనే ఆదేశాలు జారీచేస్తూ ఫోటోలను చిత్రీకరించటం వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయటం వంటి అంశాలను నిర్వర్తించవచ్చు. లండన్‌కు చెందిన ‘దిస్ ప్లేస్' సంస్థ ఈ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ మైండ్ రీడర్ అప్లికేషన్‌ను గూగుల్ గ్లాస్‌కు అనుసంధానించటం ద్వారా ఈ యాప్ గ్లాస్ ధరించిన వ్యక్తి మెదడు తరంగాలను విశ్లేషించి అతని పరిశీలన స్థాయిని లెక్కిస్తుంది.

 గూగుల్ గ్లాస్ కోసం మైండ్ కంట్రోల్ అప్లికేషన్

ఉదాహరణకు ఈ మైండ్ కంట్రోల్ అప్లికేషన్ ద్వారా మీరు ఓ ఫోటోను చిత్రీకరించాలనుకుంటే తొలత మీరు ఓ దృశ్యాన్ని ఏకాగ్రతగా పరిశీలించాలి. గూగుల్ గ్లాస్ పై తెల్లటి కాంతి రేఖ ప్రసరించేంత వరకు మీ ఏకాగ్రత కొనసాగాలి. ఇలా జరిగిన తరువాత మైండ్ ఆర్‌డీఆర్ అప్లికేషన్ మీరు చూస్తోన్న దృశ్యాన్ని ఫోటో తీయాలని గూగుల్ గ్లాస్‌కు ఆదేశాలు జారీ చేస్తుంది. మీ దృష్టిని అలాగే కొనసాగించినట్లయితే సదరు ఫోటోను గూగుల్ గ్లాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot