సైబర్ పోరాటాలకు సిద్ధంకండి: అబ్దుల్ కలాం

Posted By:

ఇంటర్నెట్ వినియోగం మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో భవిష్యత్తులో ఎదురయ్యే సైబర్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా సిద్ధం కావాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలాం విద్యార్థులనుద్దేశించి ప్రసింగించారు.

సైబర్ పోరాటాలకు సిద్ధంకండి: అబ్దుల్ కలాం

నెట్ వర్క్ ఆధారిత యుద్ధాల్లో నియంత్రణ మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని కొన్ని సందర్భాల్లో అంతరిక్ష యుద్ధాలు, సముద్ర, ఖండాంతర క్షిపణి యుద్ధాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని కలాం అన్నారు. జీవ, అణు, రసాయన యుద్ధాల కంటే సైబర్ యుద్ధం ఎంతో ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. శత్రు దేశాల బలాలను పసిగట్టగలిగిన సాంకేతికతను అందిపుచ్చుకున్న దేశమే భవిష్యత్ యుద్ధ విజేతగా నిలుస్తుందని కలాం అభిప్రాయపడ్డారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot