‘మిటాషీ టాబ్లెట్’.. ఆధునిక ఫీచర్లు, చవక ధర!

Posted By: Prashanth

‘మిటాషీ టాబ్లెట్’.. ఆధునిక ఫీచర్లు, చవక ధర!

 

దేశీయంగా బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ముంబయ్ ఆధారిత కంపెనీ మిటాషీ ‘ప్లే బీఈ 100’(Play BE 100) పేరుతో బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. ధర రూ.6,790. స్పెసిఫికేషన్‌లు....

బరువు ఇంకా చుట్టుకొలత: 193 x 124.5 x 11మిల్లీ మీటర్లు, బరువు 360 గ్రాములు,

డిస్‌ప్లే: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్రీన్ డిస్‌ప్లే, 5 పాయింట్ మల్టీటచ్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్: బాక్స్‌చిప్ ఏ10 చిప్‌సెట్‌తో కూడిన 1.2గిగాహెడ్జ్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, మాలీ- 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్,

కెమెరా: 2మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ వయా యూఎస్బీ డాంగిల్, వై-ఫై, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

బ్యాటరీ: 3000ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (4గంటలు బ్యాకప్).

ధర : రూ.6790.

కొనుగోలు పై కీబోర్డ్ కవర్ ఉచితం: ఈ టాబ్లెట్ కొనుగోలు పై రూ.1299విలువ చేసే కీబోర్డ్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు. డివైజ్‌కు ఈ కీబోర్డు‌ను జత చేయటం వల్ల టాబ్లెట్ కాస్తా వర్క్ స్టేషన్‌లా వ్యవహరిస్తుంది.

ఎక్కడ కొనుగోలు చేయాలి: డివైజ్‌ను మిటాషీ(Mitashi) అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లింక్ అడ్రస్

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot