వారికి.. ఆఖరి క్షణాలు!

Posted By:

సోషల్ మీడియాలో నిత్య కొత్తదనం కోసం పరితపిస్తున్న యువత ప్రస్తుతం ‘సెల్ఫీ' లోకంలో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా తమ ఫోటోలను తామే స్వయంగా తీసుకుని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయటమే సెల్ఫీ సంస్కృతి. అయితే ఈ సెల్ఫీ సంబరం ఒక్కోసారి శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అంటూ సెల్ఫీల సంస్కృతి మరింత వేగవంతంగా పుంజుకుంటోంది.

తమ ఆనంద సమయాలు... మిత్రులతో కలిసిన సందర్భాలు.. ప్రకృతిలో సేదతీరుతున్న దృశ్యాలు ఇలా ఎన్నెన్నో సంగతులను సోషల్ మీడియా ప్రపంచంతో షేర్ చేసుకునేందుకు సెకన్ల వ్యవధిలో స్మార్ట్‌ఫోన్ సహాయంతో సెల్ఫీలను సృష్టించేస్తున్నారు. సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీలు చిత్రీకరించుకున్న కొద్ది క్షణాల్లోనే ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయిన పలువురి వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

రెగ్గాటన్ సంగీతకారుడు జాడియిల్ మోటారు సైకిల్ ప్రమాదంలో మరణించే ముందు తీసుకున్న సెల్ఫీ ఇది

photo source: mgur

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

photo source: New York Post

ఫేస్‌బుక్‌లో తన స్నేహితులను ఆకట్టుకునేందుకు తాగిన మత్తులో ఆస్కార్ ఒటిరో అనే యువ రెటర్నరీ వైద్యుడు బల్లెట్ లోడ్ చేసిఉన్న తుపాకీని తల దగ్గరగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆస్కార్ తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కెడే మరణించాడు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

photo souce: Washington Post

 

తమ ‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడ్నుంచి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్‌లో జరిగింది. లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

photo source: Funny Moments

కరెన్ హెర్నాండెజ్ అనే మహిళ మెక్సికోలోని ఎల్ ట్యూనల్ నది సమీపంలో సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించారు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

 

photo source : Imgur

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఇరాన్ మహిళలు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ ఇద్దురు మహిళలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతూ సెల్ఫీని చిత్రకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

21 సంవత్సరాల జీన్ సెల్ఫీ తీసుకోవాలన్న తాపత్రయంతో రైలు పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ మరణించాడు.  

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

photo source : Imgur

తూర్పు యుక్రెయిన్ లో ప్రమాదానికి గురైన మాలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్17లో మరణించిన తల్లీకొడుకులు విమానం బయలుదేరేముందుకు తీసుకున్న సెల్ఫీ ఇది!

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

మెక్సికన్ పాప్‌స్టార్ జిన్నీ రివిరా తన బృందంతో కలిసి ఓ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించేందుకు తీసుకున్న సెల్ఫీ ఇది. ప్రమాదవశాత్తూ ఆ జెల్ కూలిపోవటంతో అందరూ మరణించారు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

కోలెట్ మోరెనో, ఆష్లీ థెయోబాల్డ్ అనే ఇద్దరు మహిళలు కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీ ఇది. ప్రమాదవశాత్తూ వీరు ప్రయాణిస్తున్న కారు  వేరొక వాహానాన్ని ఢీకొనటంతో ఇద్దురూ ప్రాణాలను కోల్పోయారు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ అనే మహిళ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకు కారు ప్రమాదంలో దుర్మరణంపాలైంది. యూఎస్ హైవే పై కారులో ప్రయాణిస్తున్న మహిళ కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకే ఎదురుగా వెళుతున్న రిసైకిలింగ్ ట్రక్‌ను ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

వారికి.. ఆఖరి క్షణాలు!

వారికి.. ఆఖరి క్షణాలు!

రష్యాను చెందిన 17 సంవత్సరాల గ్జెనియా గ్నాట్యేవా అనే యువతి బ్రిడ్జ్ పై నుంచి సెల్ఫీని తీసుకునే క్రమంలో అదుపుతప్పి విద్యుత్ తీగల పై పడి మరణించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moments After These Selfies Were Taken, Disturbing Tragedy Struck. Read more in Telugu Gizbot........
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting