Just In
Don't Miss
- News
దిశ లివర్‌లో భారీగా లిక్కర్, బలవంతంగా మందుతాగించిన చెన్నకేశవులు, ఇతర కేసుల్లో సరిపోలిన డీఎన్ఏ
- Finance
అమెజాన్ గో బ్యాక్... ఫ్లిప్‌కార్ట్ గో బ్యాక్ : రోడ్డెక్కిన వర్తకులు
- Sports
భారత జట్టులో చేర్చుకుంటావా?: చిన్నారి బ్యాటింగ్‌కు కోహ్లీ ఫిదా వీడియో
- Movies
శ్రీముఖిపై యాంకర్ రవి కామెంట్స్.. బిగ్‌బాస్ కమిట్మెంట్ కోసమే! ఇదీ మ్యాటర్ అంటూ సెన్సేషన్
- Lifestyle
శనివారం మీ రాశిఫలాలు 14-12-2019
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
2018లో లాంచ్ అయిన బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లు
పోర్టబుల్ కంప్యూటింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన ల్యాప్‌టాప్‌లు ఇప్పడు గేమింగ్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ల్యాప్‌టాప్ గేమింగ్‌ను ఇష్టపడుతోన్న వారిని దృష్టిలో ఉంచుకుని డెల్, అసూస్, గిగాబైట్, ఏసర్ వంటి బ్రాండ్‌లు 2018కిగాను బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. వాటి వివరాలు మీ కోసం ..
లేడిస్ హాస్టల్ లో సీక్రెట్ కెమెరాలు.. పట్టుబడిన హాస్టల్ యజమాని

ఏలియన్‌వేర్ 17 ఆర్5 (Alienware 17 R5)
డెల్ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన ఏలియన్‌వేర్ 17 ఆర్5 ఈ ల్యాప్‌టాప్ 2018కిగాను బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌గా గుర్తింపుతెచ్చుకుంది. స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 17.3 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 8వ తరం ఇంటెల్ కోర్ ఐ7-8750హెచ్ ప్రాసెసర్, 16జీబి ర్యామ్, 512జీబి పీసీఐఈ ఎమ్.2 ఎస్ఎస్‌డి క్లాస్ 40 + 1టీబీ 7200RPM HDD స్టోరేజ్, 68 వాట్ బ్యాటరీ.

అసూస్ ఆర్ఓజి జిఫైరస్ ఎమ్ జీఎమ్501 (ASUS ROG Zephyrus M GM501)
అసూస్ ఆర్ఓజి జిఫైరస్ ఎమ్ జీఎమ్501 ల్యాప్‌టాప్ టాప్ క్వాలిటీ గేమింగ్ స్పెక్స్‌తో వస్తోంది. మార్కెట్లో ఈ ల్యాపీ ఖరీదు రూ.2,36,666. స్లిమ్ లుక్, గేమింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కీబోర్డ్ ఇంకా ట్రాక్ ప్యాడ్‌లు ఇందులో ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి 3.9 గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ i7-8750H సీపీయూ, 15.6 ఇంచ్ డిస్‌ప్లే, Nvidia GeForce GTX 1070 Max-Q జీపీయూ, 16జీబి ర్యామ్, 256జీబి NVMe ఎస్ఎస్‌డి, 1టీబీ సెకండరీ ఎస్ఎస్‌హెచ్‌డి, విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టం.

అసూస్ ఆర్ఓజి స్ట్రిక్స్ స్కార్ 2 (Asus ROG Strix Scar II)
2018కిగాను మార్కెట్లో లాంచ్ అయిన బెస్ట్ మిడ్-రేంజ్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో అసూస్ ఆర్ఓజి స్ట్రిక్స్ స్కార్ 2 ఒకటి. ఈ డివైస్ ఖరీదు రూ.1,79,990. స్పెక్స్ విషయానికి వచ్చేసరికి 15.6 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే విత్ 144 HZ రిఫ్రెష్ రేట్, జీసింక్, ఇంటెల్ కాఫీ లేక్ కోర్ i7-8750H ప్రాసెసర్, 32జీబి ర్యామ్, 66వాట్ బ్యాటరీ, ఆర్‌జిబి బ్యాక్‌లైట్ కీబోర్డ్, ల్యాపీ బరువు 2.42 కిలోగ్రాములు.

గిగాబైట్ ఏరో 15 (Gigabyte Aero 15)
2018కిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యుత్తమ గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో గిగాబైట్ ఏరో 15 ఒకటి. ఈ ల్యాపీ 6 కోర్ 8th జనరేషన్ ఇంటెల్ కోర ఐ7 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్‌కు అనుసంధానించిన GTX 1060 జీపీయూ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది. స్పెక్స్ విషయానికి వచ్చేసరికి 15.6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ7 8750H సీపీయూ, Nvidia GeForce GTX 1060 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 512జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం.

ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 (Acer Predator Helios 300)
2018కిగాను మార్కెట్లో లాంచ్ అయిన అత్యుత్తమ గేమింగ్ ల్యాప్‌టాప్‌లలో ఏసర్ ప్రిడేటర్ హీలియోస్ 300 ఒకటి. ఈ ల్యాపీ శక్తివంతమైన GTX 1060 6GB గ్రాఫిక్స్ కార్డుతో వస్తోంది. 15.6 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 60Hz రిఫ్రెష్ రేట్, ఇంటెల్ కోర్ ఐ7-7700HQ సీపీయూ, ఎన్‌విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 1060 6జీబి జీపీయూ, 16జీబి డీడీఆర్4 ర్యామ్, 256జీబి ఎమ్.2 SATA SSD స్టోరేజ్, 48 వాట్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఈ ల్యాపీలో ఉన్నాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790