మోషన్ కంప్యూటింగ్...కొత్త ట్రెండ్ గురూ!

By Super
|

మోషన్ కంప్యూటింగ్...కొత్త ట్రెండ్ గురూ!

 

ప్రముఖ సంస్థ మోషన్ కంప్యూటింగ్, టాబ్లెట్ కంప్యూటర్ల పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది పలుకుతూ ‘సీఎల్910’ పేరుతో కొత్తతరం టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. ప్రత్యేకించి వ్యాపార వర్గాల కోసం రూపొందించబడిన ఈ గ్యాడ్జెట్ మొబిలిటీ, డ్యూరబులిటీ, కనెక్టువిటీ వంటి పటిష్టమైన అంశాలను ఒదిగి ఉంది. విండోస్ 7 ఆధారితంగా స్పందించే ఈ డివైజ్‌లో శక్తివంతమైన ఇంటెల్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. టాబ్లెట్ ఫీచర్ల విషయానికొస్తే... అమర్చిన 10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంటుంది. ఈ వెసులబాటుతో పీసీని రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు. స్ర్కీన్ ఆపరేటింగ్‌లో భాగంగా యాజర్ హై - రిసల్యూషన్‌తో కూడిన డిజిటైజర్ పెన్‌ను పొందవచ్చు.

ఇతర స్పెసిఫికేషన్‌లు:

మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ప్రొఫెషనల్ ఆపరేటింగ్ సిస్టం (విండోస్‌8‌కు అప్‌గ్రేడ్ చేసుకునే సౌలభ్యత),

ఇంటెల్ ఆటమ్ ఎన్2600 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

128జీబి సాలిడ్ స్టేట్ డ్రైవ్,

2జీబి ర్యామ్,

బ్లూటూత్ 4.0 క్యాపబులిటీ,

ట్రస్టుడ్ ప్లాట్ ఫామ్ మాడ్యుల్ ( డేటా ప్రొటెక్షన్ కోసం),

బార్ కోడ్ స్కానర్, మ్యాగ్నెటిక్ స్ట్రైప్ రీడర్,

3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

1.3మెగాపిక్సల్ రేర్ ఫేసింగ్ వెబ్ క్యామ్,

వై-ఫై, జీపీఎస్,

హైడెఫినిషన్ ఆడియో ఇంకా వీడియో,

ధర అంచనా రూ.65,000.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X