మోటరోలా@డిసెంబర్!!!

Posted By: Staff

మోటరోలా@డిసెంబర్!!!

 

టాబ్లెట్ పీసీల సెక్టార్లో తమ సత్తాను చాటేందుకు సాంకేతిక దిగ్గజం ‘మోటరోలా’ఉవ్విలూరుతుంది. అత్యాధునిక ఫీచర్లతో మన్నికైన టాబ్లెట్ పరికరాన్ని ఈ డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘మోటరోలా డ్రాయిడ్ ఎక్స్‌వై బోర్డ్ ’ వర్షన్లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లకు సంబంధించి ఫీచర్లు క్లుప్తంగా...

- రెండు స్క్ర్రీన్ సైజ్ వేరియంట్లో ఈ పరికరం డిజైన్ కాబడింది. ఒకటి 8.2 అంగుళాలు మరోకటి 10.1 అంగుళాలు,

- వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు 16, 32 జీబీ వర్షన్లలో పీసీలను రూపొందించినట్లు తెలస్తోంది,

-10.1 వేరియంట్లో డిజైన్ కాబడిన డ్రాయిడ్ ఎక్స్‌వై బోర్డ్ టాబ్లెట్ పీసీలో 64జీబీ మెమరీ ఆప్షన్ సౌలభ్యత,

- గొరిల్లా గ్లాస్ కోటింగ్,

-OMAP 4430 ప్రాసెసింగ్ వ్యవస్థ,

- క్లాక్ స్పీడ్ 1200MHz,

- ర్యామ్ సామర్ధ్యం 1జీబీ,

- సీడీఎమ్ఏ సపోర్ట్,

- బ్లూటూత్ 2.1 వర్షన్,

- యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

- వై-ఫై కనెక్టువిటీ,

- డేటా ట్రాన్స్ ఫర్ సామర్ధ్యం 480 MB/second,

- డిసెంబర్ 8న విడుదలకాబోతున్న ఈ గ్యాడ్జెట్లకు సంబంధించి ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot