మోటరోలా ఆన్‌లైన్ బుకింగ్ ఆఫర్!!

Posted By: Staff

మోటరోలా ఆన్‌లైన్ బుకింగ్ ఆఫర్!!

 

కంప్యూటింగ్ ఉపకరణాల తయారీ సంస్థ మోటరోలా, డ్రాయిడ్ సిరీస్ నుంచి రెండు అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్‌లను వ్ళద్థి చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్‌లు ‘డ్రాయిడ్ ఎక్స్‌వై బోర్డ్ 8.2’, ‘డ్రాయిడ్ ఎక్స్‌వై బోర్డ్ 10.1’ నమూనాలలో లభ్యమవుతున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా వీటి విక్రయాలు ప్రారంభించిన మోటరోలా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. నేరుగా మోటరోలా వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి ఈ డివైజ్‌లను బుక్ చేసుకున్న వారికి రెండు రోజుల రవాణా ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది.

ప్రధాన ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం,

* TI OMAP 4430 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 1జీబి ర్యామ్,

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

* వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్,

* బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,

* హై డెఫినిషన్ వీడియో క్వాలిటీ,

16జీబి, 32జీబి మెమరీ స్టోరేజి వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఈ టాబ్లెట్ పీసీల ధరల వివరాలు:

డ్రాయిడ్ ఎక్స్ వై బోర్డ్ 10.1 (16జీబి వేరియంట్) : 25,000.

డ్రాయిడ్ ఎక్స్ వై బోర్డ్ 10.1 (32జీబి వేరియంట్) : 30,000.

డ్రాయిడ్ ఎక్స్ వై బోర్డ్ 8.2 (16జీబి వేరియంట్) : 20,000.

డ్రాయిడ్ ఎక్స్ వై బోర్డ్ 8.2 (32జీబి వేరియంట్) : 25,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot