మీ వ్యాపారానికి పునాది రాయి!!!

Posted By: Prashanth

మీ వ్యాపారానికి పునాది రాయి!!!

 

బిజినెస్ వ్యవహారాలకు సంబంధించి లావాదేవీలను చక్కదిద్దటంలో నేర్పరి పాత్ర పోషించే టాబ్లెట్ కంపూటర్‌ను ‘మోటరోలా’డిజైన్ చేస్తుంది. వ్యాపార వర్గాలకు పూర్తి స్ధాయిలో దోహదపడే విధంగా ‘మోటరోలా ET1’ తెరకెక్కుతుంది.

ముఖ్య ఫీచర్లు:

ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.4 జింజర్ బోర్ట్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయర్ కోర్ OMAP4 ప్రాసెసర్, క్లాక్ స్పీడ్ 1GHz, 7 అంగుళాల టచ్‌స్ర్కీన్, మల్టీ టచ్ వ్యవస్థ, 8 మెగా పిక్సల్ కెమెరా, 4620 mAh సామర్ధ్యం గల పటిష్ట బ్యాటరీ వ్యవస్థ,

పనితీరు:

ఆండ్రాయిడ్ వర్షన్ 2.3.4 జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ టాబ్లెట్ రన్ అవతుంది. నిక్షిప్తం చేసిన డ్యూయర్ కోర్ OMAP4 ప్రాసెసర్ పీసీ పనితీరును వేగిరితం చేస్తుంది. 7 అంగుళాల డిస్ ప్లే టచ్ ఆధారితంగా పని చేస్తుంది. మల్టీ టచ్ వ్యవస్థతో డివైజ్‌ను మరింత సులువుగా ఆపరేట్ చేయ్యవచ్చు.

నలుపు రంగులో డిజైన్ కాబడిన ‘మోటరోలా ET1’ పూర్తి స్థాయి ప్రొఫెషనల్ లుక్‌‌ను కలిగి ఉంటుంది. ర్యామ్ సామర్ధ్యం 1జీబి, ఫోన్ ఇన్‌బుల్ట్ మెమరీ 4జీబి, ఎక్స్ ప్యాండబుల్ విధానం ద్వారా జీబి శాతాన్ని 32కు పెంచుకోవచ్చు. పీసీలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్స్ కెమెరా వ్యవస్థ నాణ్యమైన చిత్రాలను అందిస్తుంది. వీడియో కాలింగ్‌కు ఉపకరించే విధంగా వీజీఏ రిజల్యూషన్ సామర్ధ్యంతో కూడిన ఫ్రంట్ కెమెరాను నిక్షిప్తం చేశారు.

ఏర్పాటు చేసిన మల్టీ మీడియా ప్లేయర్ వ్యవస్థ పూర్తి స్థాయి వినోదాన్ని పంచుతుంది. బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ వ్యవస్థను అవసరమైన డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. హెచ్డీఎమ్ఐ పోర్ట్ సౌలభ్యతతో హైడెఫినిషన్ టీవీలకు పీసీని జత చేసుకోవచ్చు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన కీలక లావాదేవీలను ఈ టాబ్లెట్ ద్వారా నిర్విహించుకోవచ్చు.

3 సంవత్సరాల వారంటీతో లభ్యం కానున్న ‘మోటరోలా ET1’ టాబ్లెట్ పీసీ ధర, విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot