మోటరోలా తాజా విడుదల ఏంటి..?

టాబ్లెట్ పీసీల సెక్టార్లో తమ సత్తాను చాటేందుకు సాంకేతిక దిగ్గజం ‘మోటరోలా’ఉవ్విలూరుతుంది. అత్యాధునిక ఫీచర్లతో మన్నికైన టాబ్లెట్ పరికరాన్ని ఈ డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘మోటరోలా డ్రాయిడ్ ఎక్స్‌వై బోర్డ్ ’ వర్షన్లో విడుదలవుతున్న ఈ గ్యాడ్జెట్లకు సంబంధించి ఫీచర్లు క్లుప్తంగా...
రెండు స్క్ర్రీన్ సైజ్ వేరియంట్లో ఈ పరికరం డిజైన్ కాబడింది. ఒకటి 8.2 అంగుళాలు మరోకటి 10.1 అంగుళాలు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు 16, 32 జీబీ వర్షన్లలో పీసీలను రూపొందించినట్లు తెలస్తోంది. 10.1 అంగుళాల వేరియంట్లో డిజైన్ కాబడిన డ్రాయిడ్ ఎక్స్‌వై బోర్డ్ టాబ్లెట్ పీసీలో 64జీబీ మెమరీ ఆప్షన్ సౌలభ్యత, పటిష్టమైన గొరిల్లా గ్లాస్ కోటింగ్, OMAP 4430 ప్రాసెసింగ్ వ్యవస్థ, క్లాక్ స్పీడ్ 1200MHz, ర్యామ్ సామర్ధ్యం 1జీబీ, సీడీఎమ్ఏ సపోర్ట్, బ్లూటూత్ 2.1 వర్షన్,
యూఎస్బీ 2.0 కనెక్టువిటీ, వై-ఫై కనెక్టువిటీ, డేటా ట్రాన్స్ ఫర్ సామర్ధ్యం 480 MB/second, డిసెంబర్ 8న విడుదల.


Click it and Unblock the Notifications








