మోటరోలా జనాకర్షణ మంత్రం, మార్కెట్లో ఫ్లెమింగ్ టాబ్లెట్లు త్వరలో..!!

ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధిరితంగా రూపుదిద్దుకుంటున్న ఈ ల్యాపీ పరికరాలు 8, 10 అంగుళాల స్క్రీన్ సైజు కలిగి ఉంటాయి.
8 అంగుళాల టాబ్లెట్ పీసీ ‘ఫ్లెమింగ్ ఇమారా’ మోడల్ గా, 10 అంగుళాల టాబ్లెట్ పీసీ ‘మోటరోలా ఫ్లెమింగ్’ మోడల్ గా తుదిమెరుగులు దిద్దుకుంటున్నట్లు వినికిడి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు క్లుప్తంగా ఈ గ్యాడ్జెట్ల ఫీచర్లు..
- ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పని చేసే టాబ్లెట్ పీసీలలో అదనంగా 4G LTE చిప్ ను అనుసంధానించారు. ఈ చిప్ అనుసంధానంతో రెండు టాబ్లెట్లు 4జీ నెటవర్కింగ్ వ్యవస్థకు ఉపకరస్తాయి.
- మోటరోలాకు మరింత సక్సెస్ నిచ్చిన ‘Xoom 2 టాబ్లెట్’ ఫీచర్లను, రూపుదిద్దుకుంటున్న ఫ్లెమింగ్ టాబ్లెట్ ప్రాజెక్టుల్లో ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.
- మన్నికైన ప్రైమరీ, సెకండరీ కెమెరా వ్యవస్థలను ‘హై డెఫినిషన్’ నాణ్యతతో టాబ్లెట్ పీసీలలో ఏర్పాటు చేస్తున్నారు.
- ఈ పరికరాల ‘డిస్ ప్లే’ను సురక్షితమైన ‘స్ర్ర్కాచ్ రెసిస్టివ్’ వ్యవస్థతో పటిష్టంగా తీర్చిదిద్దారు.
- హై డెఫినిషన్ సామర్ధ్యం గల 1080 పిక్సల్ రిసల్యూషన్ వ్యవస్థను గ్యాడ్జెట్లలో ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
- తెలుపు, నలుపు రంగుల్లో ఈ టాబ్లెట్లు డిజైన్ చేయుబడుతున్నాయట.


Click it and Unblock the Notifications