మోటరోలా తాజా పురోగతి..?

Posted By: Super

మోటరోలా తాజా పురోగతి..?

ప్రముఖ టెక్ పరిశ్రమల్లో ఒకటైన ‘మోటరోలా’ అభివృద్థి పధంలో అడుగులు వేస్తుంది. పరిశోధనలో కీలక పరిణితి సాధించిన ఈ ప్రముఖ బ్రాండ్ ఉన్నత ప్రమాణాలతో కూడిన హైఎండ్ గ్యాడ్జెట్లను ప్రమోట్ చేసే దిశగా పావులు కదుపుతుంది.

మొబైల్స్ మరియు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలలో ఇప్పటికే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ‘మోటోరోలా’ తాజాగా టాబ్లెట్ కంప్యూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. మోటరోలో Xoom1, xoom2 వర్షన్లలో డిజైన్ కాబడిన టాబ్లెట్ పీసీలు అత్యాధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగి ఉన్నాయి.

‘మోటరోలా Xoom1’ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్, 1000 MHz డ్యూయల్ కోర్ న్విడియా టెగ్రా 2 ప్రాసెసర్, 32జీబీ మైక్రో ఎస్డీ స్లాట్, 1జీబీ ర్యామ్, 10.1 అంగుళాల డిస్ ప్లే, మల్టీ టచ్ స్క్రీన్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ డిజిటల్ కెమెరా, 720p హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 802.11 b/g/n వై-ఫై కనెక్టువిటీ, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్, 3.5 ఆడియో జాక్, ఆధునిక వర్షన్ యూఎస్బీ పోర్ట్ర్స్, లితియమ్ ఐయాన్ బ్యాటరీ (10 గంటల బ్యాకప్) ఇతర అత్యాధునిక మల్టీ మీడియా ఫీచర్లను నిక్షిప్తం చేశారు.

మోటరోలా Xoom2 ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 3.2 ఆపరేటింగ్ సిస్టమ్, 1200 MHz డ్యూయల్ కోర్ న్విడియా టెగ్రా 2 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 32జీబీ మైక్రో ఎస్డీ స్లాట్, 10.1 అంగుళాల డిస్ ప్లే, మల్టీ టచ్ స్క్రీన్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ డిజిటల్ కెమెరా , 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, 802.11 b/ g/ n వై-ఫై కనెక్టువిటీ, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్, 3.5 ఆడియో జాక్, 3.5 ఆడియో జాక్, ఆధునిక వర్షన్ యూఎస్బీ పోర్ట్ర్స్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ (11 గంటల బ్యాకప్) ఇతర అత్యాధునిక మల్టీ మీడియా ఫీచర్లను నిక్షిప్తం చేశారు.

ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషెల్ నెట్ వర్కింగ్ అంశాలను టాబ్లెట్లలో ముందుగానే లోడ్ చేశారు. క్యాలెండర్, ఆలారమ్, డాక్యూమెంట్ వ్యూవర్ వంటి అత్యాధునిక ఆప్లికేషన్లను ముందుగానే లోడ్ చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot