చాలా చాలా గ్యాప్ తరువాత!!

By Super
|
Motorola Xoom Family Edition tablet out in market


గ్యాడ్జెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మోటరోలా సూమ్ ఫ్యామిలీ ఎడిషన్ టాబ్లెట్’ ఎట్టకేలకు అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్‌లో అత్యాధునిక అప్లికేషన్‌లను నిక్షిప్తం చేశారు. పీసీలో ఏర్పాటు చేసిన మరో ఫీచర్ పూర్తి - నిడివి మ్యూజికల్ ఈ-బుక్ అత్యుత్తమ యానిమేషన్ అనుభూతులు చేరువచేస్తుంది.

టాబ్లెట్ కీలక ఫీచర్లు:

10.1 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్) ,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్‌ఈడి ఫ్లాష్, డిజిటల్ జూమ్, ఆటోఫోకస్ సౌలభ్యతతో),

1.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ( ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),

ఆండ్రాయిడ్ 3.1 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం (ఈ వోఎస్‌ను ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు),

హై క్వాలిటీ ఆడియో ప్లేయర్,

హై క్వాలిటీ వీడియో ప్లేయర్,

ఇంటర్నెట్ కనెక్టువిటీ,

వై-ఫై,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడగించుకోవచ్చు,

బ్యాటరీ స్టాండ్ బై 14 రోజులు,

బ్యాకప్ (వై-ఫై బ్రౌజింగ్ కు 10 గంటలు, వీడియో ప్లేబ్యాక్ కు 10 గంటలు)

కేవలం 650 గ్రాముల బరువు కలిగి ఉన్న ఈ డివైజ్ ఉత్తమ క్వాలిటీతో కూడిన కంప్యూటింగ్‌ను అందిస్తుంది. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ 3.1 ఆపరేటింగ్ సిస్టం వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌కు తోడ్పడుతుంది. వెనుక భాగంలో అమర్చిన 5 మెగా కెమెరా ఉన్నత విలువలతో కూడిన ఫోటోగ్రఫీని చేరువచేస్తుంది. ముందుభాగంలో అమర్చిన 1.3 మెగాపిక్సల్ వెబ్‌క్యామ్ క్లారిటీతో కూడిన ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు సహకరిస్తుంది. ఈ టాబ్లెట్ వినియోగం ద్వారా యూజర్ జీమెయిల్, గుగూల్ మ్యాప్స్, గుగూల్ టాక్, యూట్యూబ్ ఇతర గుగూల్ సర్వీసులను ఆస్వాదించవచ్చు. ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న మోటరోలా సూమ్ ఫ్యామిలీ ఎడిషన్ టాబ్లెట్ ధర రూ.16,000 ఉండొచ్చని ఓ అంచనా.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X