‘ఎంపీ’లందరికి టాబ్లెట్ పీసీలు!!

Posted By: Staff

‘ఎంపీ’లందరికి టాబ్లెట్ పీసీలు!!

టెక్నాలజీతో నడుస్తున్న రోజులివి, పనులు వేగంగా జరగాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పక వినియోగించుకోవల్సిందే. దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ సైతం సాంకేతికతను అనుసరించే ప్రయత్నం చేస్తుంది.

ప్రశ్నగంట మరియు డిబేట్ల సమయంలో ప్రింటింగ్ పేపర్ ఖర్చును తగ్గించుకోవటంతో పాటు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకునేందుకు వీలుగా పార్లమెంట్ ఈ ప్రతిపాదనను చేసింది.

పార్లమెంట్ ఉభయసభల్లోని 790 మంది ఎంపీలూ ట్యాబ్లెట్లు కొనుక్కోవాలని ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇచ్చారు. రాజ్యసభలోని 90 శాతం సభ్యుల్లో కొందరు ఇప్పటికే శ్యామ్‌సంగ్ ట్యాబ్లెట్లు, మరికొందరు ఆపిల్ ఐప్యాడ్లు కోనుగోలు చేశారు. ముందుగా రాజ్యసభ సభ్యులు ఈ పీసీలను ఉపయోగించటం మొదలుపెట్టన పిదప లోకసభ సభ్యులు ఇదే విధానాన్ని అవలంభిస్తారట.

ఎంపీలకు అవసరమైన సమచారాన్ని అందించేందుకు నేషనల్ ఇన్‌ఫర్‌మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సిద్ధమైంది. ఆపిల్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సంబంధిత అప్లికేషన్లు పని చేసే విధంగా జాతీయ సమాచార కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ టాబ్లెట్ల వినియోగం పై ఎంపీలకు త్వరలోనే శిక్షణనివ్వనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot