దగ్గర సంబంధమే.. కానీ ‘తేడా’??

Posted By: Super

దగ్గర సంబంధమే.. కానీ ‘తేడా’??

నిత్యం రద్దీగా ఉండే భారతీయ టాబ్లెట్ మార్కెట్లోకి ఎమ్‌ఎస్‌ఐ (MSI) సంస్థ ‘ఎంజాయ్ 7’ పేరుతో టాబ్లెట్‌ను లాంఛ్ చేయునుంది. ప్రస్తుత పోటీ మార్కెట్ నేపధ్యంలో ఎమ్‌ఎస్‌ఐ కొత్తదనానికి ప్రాధాన్యమిస్తూ ‘ఎంజాయ్ 7’ రంగంలోకి దించనుంది.

ప్రపంచ వ్యాప్తంగా టాబ్లెట్ వినియోగదారులను ఆకట్టకుంటున్న ‘ఎంజాయ్ 7 ’, తాజాగా రిలయన్స్ విడుదల చేసిన ‘రిలియన్స్ 3జీ’ టాబ్లెట్ పీసీకీ దగ్గర పోలికలు కలిగి ఉంది. టెక్నాలజీని మరింత వృద్ధిచేస్తూ తాజాగా విడుదల చేసిన ‘ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ’ ఆధారితంగా ఈ రెండు టాబ్లెట్ పీసీలు పనిచేస్తాయి.

7 అంగుళాల TFT-LCD మల్టీ టచ్ స్క్రీన్‌తో 800 x 480 పిక్సల్ డిస్‌ప్లే సామర్థ్యం కలిగి, రెండు సమాన డిస్‌ప్లేలు కలిగి ఉన్నాయి. కెమెరా అంశాలను పరిశీలిస్తే ఈ రెండు బ్రాండ్లు 2 మోగా పిక్సల్ ‘రేర్’ కెమెరా కలిగి ఉన్నాయి. అయితే ‘రిలయన్స్ 3జీ’లో ‘0.3’ మోగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్, ఛాటింగ్ లకు ఉపకరిస్తుంది. ఇక ‘ఎంజాయ్ 7’ ఫ్రంట్ కెమెరాకు సంబంధించి స్పెసిఫికేషన్లు తెలియాల్సి ఉంది.

ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్ల విషయానికి వద్దాం.. ఇక్కాడా ఈ రెండు బ్రాండ్లు ఒకే పోలికను కలిగి ఉన్నాయి. మల్టీ ఫార్మెట్ మ్యూజిక్ ప్లేయర్‌ను సపోర్టు చేసే ఆడియో ప్లేయర్, స్టీరియో స్పీకర్లు, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్, మల్టీ ఫార్మట్ వీడియో ప్లేయర్ వంటి అంశాలగ రెండుటిలోనూ సాధారణమే. వై - పై సామర్థ్యం కలిగి ఉన్నఈ టాబ్లెట్లు బ్లూటూత్, యూఎస్‌బి పోర్టుల సహకారంతో డేటాను వేగవంతగా ట్రాన్స్‌ఫర్ చేయగలవు. అదే విధంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు.

బ్యాటరీ విషయంలో స్వల్ప మార్పులను ఈ రెండింటి మధ్య గమనించవచ్చు. ‘ఎంజాయ్ 7’ లైన్ 4700 mAh బ్యాటరీ వ్యవస్థ కలిగి ఉంటే, ‘రిలియన్స్ 3జీ’ లైన్ 3400mAh సామర్ధ్యం కలిగి ఉంది. మెమరీ బ్యాకప్ విషయంలో ‘ఎంజాయ్ 7’ 64 జీబీ సామర్థ్యం కలిగి ఉంటే, ‘రిలియన్స్ 3జీ’ 32 జీబీ సామర్థ్యం కలిగి ఉంది. బరువు విషయాన్ని పరిశీలిస్తే.. ఎంజాయ్ 395 గ్రాములు, రిలయన్స్ 3జీ 389 గ్రాములు ఉన్నాయి. ఫీచర్ల విషయంలో దాదాపు ఒకటే వృత్యాసం కలిగి ఉన్న ఈ టాబ్లెట్ పీసీలు ధరల విషయంలో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి. వినియోగదారునికి అందుబాటైన ధరలో ‘రిలియన్స్ 3జీ టాబ్లెట్’ రూ.12,999కి లభిస్తుంటే, ఎంజాయ్ 7 మార్కెట్ ధర రూ.14,999 ఉండోచ్చని అంచనా.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot