యుద్ధభూమిలో చెలరేగిపోండి కొత్త ‘ఎమ్ఎస్ఐ’ గేమింగ్ ల్యాపీతో..!!

Posted By: Super

యుద్ధభూమిలో చెలరేగిపోండి కొత్త ‘ఎమ్ఎస్ఐ’ గేమింగ్ ల్యాపీతో..!!


‘‘యువత ఊహలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గేమింగ్ వ్యవస్థలు రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. నానాటికి కంప్యూటింగ్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు టెక్నాలజి ఎదుగుదలకు దోహద పడుతున్నాయి. గేమింగ్ ప్రేమికుల కో్సం ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘ఎమ్ఎస్ఐ’ గేమింగ్ ల్యాప్ టాప్ పరికారన్ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘ఆటల’ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ల్యాపీ యువతరాన్ని మరింత ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు ధృడ నిశ్చయంతో ఉన్నాయి.’’


క్లుప్తంగా ఫీచర్లు:

- ఎమ్ఎస్ఐ GT80DX మోడల్ తో విడుదలు కాబోతున్న ఈ ల్యాపీ 17.3 అంగుళాల వెడల్పు స్ర్కీన్ కలిగి ఉంటుంది.

- హై డెఫినిషన్ నాణ్యత, ఎల్ ఇడి బ్యాక్ లైట్ వంటి అంశాలు నాణ్యమైన గేమింగ్ అనుభూతిని కలిగిస్తాయి.

- న్విడియా జీఫోర్స్ GTX 570 M గ్రాఫిక్ వ్యవస్థ సమర్థమైన పనితీరు కలిగి అత్యుత్తమ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ అందిస్తుంది.

- ముందుగానే అప్ లోడ్ చేసిన డీవీడీ రైటర్, బ్లూరే రీడర్ వంటి అప్లికేషన్లు వినియోగదారుడికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

- ల్యాపీలో పొందుపరిచిన 2.1 ఛానెల్ డైన్ ఆడియో సౌండ్ వ్యవస్థ అత్యుత్తమ డిజిటల్ సౌండ్ అనుభూతిని విడుదల చేస్తుంది.

- ఆధునిక వ్యవస్థతో పొందుపరిరచిన వై - ఫై, బ్లూ - టూత్ వంటి అంశాలు సమాచార వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తాయి.

- మెటాలిక్ ఫినిష్ తో రూపొందించిన కీ ప్యాడ్ వినియోగదారుడికి సుఖవంతమైన పని సౌలభ్యతను అందిస్తుంది.

- ల్యాపీలో పొందుపరిచిన అన్ని ఫీచర్లు వేగవంతవైన పని తీరును ప్రదర్శిస్తాయి. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ ల్యాపీ ధర రూ. 1, 25,000 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot