మా ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్తమమైనది: ఎమ్ఎస్ఐ

By Prashanth
|
MSI


నాటి నుంచి నుంచి నేటి వరకు హై క్వాలిటీ కంప్యూటర్‌లను దిగ్విజయంగా ఉత్పత్తి చేస్తున్న ఎమ్ఎస్ఐ(MSI) మరోసారి తన సత్తాను చాటుకునేందుకు తహ తహ లాడుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ పరిధి మరింత విస్తరించిన క్రమంలో ఈ విభాగం పై దృష్టి సారించిన ఎమ్ఎస్ఐ రెండు అత్యుత్తమ గేమింట్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్ ముందుకు తేనుంది. జీటీ 783, జీటీ 783R మోడల్స్‌లో వస్తున్న ఈ గేమింగ్ ల్యాపీ ముఖ్య విశేషాలను పరిశీలిద్దాం...

‘జీటీ 783’ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:

* విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ Intel core i7-2670QM క్వాడ్ కోర్ ప్రాసెసర్, * ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 2.2 GHz, * ల్యాపీ డిస్ ప్లే 17.3 అంగుళాలు, * న్విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 580ఎమ్ గ్రాఫిక్ కార్డ్, * హార్డ్ డ్రైవ్ మెమరీ సామర్ధ్యం 750జీబి, * ఎస్ఎస్‌డి మెమరీ సామర్ధ్యం 128జీబి, * ర్యామ్ 12జీబి, * బ్లూ రే డిస్క్ బర్నర్ (అదనపు ఫీచర్)

‘జీటీ 783 ఆర్’ ఫీచర్లు, స్పెసిఫికేషన్ లు:

ఈ ల్యాపీలో స్టోరేజి వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ ద్వంద హార్డ్ డిస్క్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ 7200 RPM హార్డ్‌డిస్క్‌ల స్టోరేజి 1.5టీబీ, పొందుపరిచిన ర్యామ్ సామర్ధ్యం 16జీబి.

మరిన్ని ఫీచర్లు:

* విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, * ఇంటెల్ కోర్ Intel core i7-2670QM క్వాడ్ కోర్ ప్రాసెసర్, * ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ 2.2 GHz, * ల్యాపీ డిస్ ప్లే 17.3 అంగుళాలు, * న్విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 580ఎమ్ గ్రాఫిక్ కార్డ్, * బ్లూ రే డిస్క్ బర్నర్ (అదనపు ఫీచర్).

ఈ ల్యాపీలలోని ఫీచర్లను పరిశీలిస్తే ఒక్క మెమరీ తప్ప తక్కిన అంశాలన్ని సమాన ప్రాతిపదికను కలిగి ఉన్నాయి. వేగవంతమైన పనితీరును కనబర్చే ఈ డివైజ్‌లు గేమింగ్ ప్రియుల అనుభూతుని రెట్టింపు చేస్తాయి. ఇండియన్ మార్కెట్లో వీటి ధర, విడుదల అంశాలకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికావల్సి ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X