భారతీయుల కోసం MSI ఆ రెండు బహుమతులట..!!

Posted By: Super

భారతీయుల కోసం MSI ఆ రెండు బహుమతులట..!!

గత 25 సంవత్సరాలుగా digital రంగంలో తనదైన పాత్రపోషిస్తున్న MSI బ్రాండ్, భారతీయులకు నాణ్యమైన digital వస్తువులను సమకూర్చటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బ్రాండ్ తన పరిధిని మరింత పెంచుకునే క్రమంలో ‘tablet’ పీసీల మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయునుంది.

Enjoy 10, Enjoy 7 పేరుతో ఈ బ్రాండ్ రెండు సరికొత్త tablet పీసీలను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. Enjoy series హిట్ తో MSI బ్రాండ్ మరోసారి మార్కెట్లో తన విశ్వసనీయతను రుజువుచేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలిసిన వివరాల మేరకు MSI, Enjoy series పేరుతో మరిన్ని వేరియంట్లను త్వరలో మార్కెట్లో విడుదల చేయునున్నట్లు సమాచారం. అత్యుత్తమ పనితీరును వినియోగదారులకు అందించే నేపధ్యంలో రూపుదిద్దుకున్న Enjoy 10, Enjoy 7లు, ఒక్క సైజు విషయాన్ని మినహాయిస్తే తక్కిన విషయాలన్నింటిలో ఇంచు మించుగా ఒకేలా ఉంటాయి. Enjoy 10, 10 అంగుళాల విస్తీర్ణం కలిగి 1024 x 768 display resolution కలిగి ఉంటుంది. Enjoy 7 మాత్రం, 7 అంగుళాల విస్తీర్ణం కలిగి 800 x 480 display resolution కలిగి ఉంటుంది.

ఇక operating system విషయానికి వస్తే , Android 2.3 Gingerbread మరియు 1.2 GHz Cortex-A8 processorలు వ్యవస్థను సమర్థవంతంగా నడిపిస్తాయి. connectivity విషయంలో ప్రత్యేక దృష్టిని సారించిన MSI వర్గాలు, Wi-Fi, Bluetooth వంటి అంశాలు చురుకుగా పని చేసే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. Enjoy 10, Enjoy 7లలో అమర్చబడిన 2 mega pixel camera నాణ్యమైన ఫోటోలతో పాటు వీడియోలను రికార్డు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ టాబ్లెట్లలో పొందుపరిచిన Adobe Flash 10.1. వ్యవస్థ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక memory storage అంశానికి వస్తే expand పద్దతి ద్వారా memoryని 32 GBకి పెంచుకోవచ్చు. బ్యాటరీ విషయంలో వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులుకు లోనుకాకుండా ఉండేదుకు 4000 mAh సామర్థ్యం కలిగిన batteryని పొందుపరిచారు.

చిన్న సైజులో దర్శనమిచ్చే Enjoy 7 టాబ్లెట్ ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికైనా తీసుకువెళ్లోచ్చు. ఇక Enjoy 10 విషయానికొస్తే టాబ్లెట్ సైజు కాస్త పెద్దదిగా ఉంటుంది. ఇక వీటి ధరల విషాయానికి వస్తే ఇండియన్ మార్కెట్లో Enjoy 10 ధర రూ. 14,999 ఉండగా, Enjoy 7 ధర రూ. 13,999 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot