ఆ ‘ఒక్కడు’.. వాటి ‘దూకుడు’కు తట్టకోగలడా..?

Posted By: Staff

ఆ ‘ఒక్కడు’.. వాటి ‘దూకుడు’కు తట్టకోగలడా..?

భారతీయ సాంకేతిక పరికరాల మార్కెట్లో తనకంటూ సుస్థిర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్‌ఎస్‌ఐ (MSI), ‘U270’ పేరుతో నోట్‌బుక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. మధర్ బోర్డులతో పాటు గ్రాఫీక్ బోర్డుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ నోట్‌బుక్‌ల తయారీ పై దృష్టి సారించింది. అయితే ఇటీవల ఈ బ్రాండ్ ‘GX660’ పేరుతో ఆడ్వాన్సడ్ గేమింగ్ నోట్‌బుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

కంటికి ఇంపుగా కనిపించే విధంగా గ్లూసీ ఫినిష్‌తో తీర్చిదిద్దిన ఈ ‘నోట్‌బుక్’ ఫీచర్లను పరిశీలిస్తే ,రెండు స్ర్కీన్ సైజు ఆప్షన్లు కలిగి ఉంటుంది. ఇందులో మొదటి స్క్రీన్ సైజు 11.6 అంగుళాలు కాగా, రెండవ స్ర్ర్కీన్ సైజు 12.1 అంగుళం వైశాల్యం కలిగి ఉంది. ఈ స్క్రీన్లు 1366 X 768 రిసల్యూషన్ కలిగి పెద్ద ఐకాన్లుగా దర్శనమిస్తాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ‘నోట్‌బుక్’ అడుగు భాగంలో బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

బరువు విషయానికి వస్తే 1 1.3 కేజీలు కలిగి ఉంటుంది. ఇక కనెక్టువిటీ అంశానికి వస్తే వర్షన్ 3.0తో రూపుదిద్దుకున్న USB పోర్ట్‌లను పొందుపరిచారు. అయితే ఇతర ఆప్షన్‌లైన వీజీఏ, హెచ్‌డీ‌ఎమ్‌ఐ, కార్డ్ రీడర్ వంటి అంశాలను ముందుగానే నోట్‌బుక్‌లో లోడ్ చేశారు. ఇక ఏర్పాటు చేసిన సరికొత్త చిక్‌లెట్ కీబోర్డు, బటన్లు వినియోగదారునికి మరింత సౌకర్యవంతంగా సహకరిస్తాయి.

శక్తివంతమైన AMD’s Zacate E-350 డ్యూయల్ కోర్‌ను నోటు‌బుక్‌లో అమర్చారు. మెమరీ స్టోరేజి అంశాన్ని పరిశీలిస్తే 2జీబీ ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంటుంది.. అయితే దీన్ని ఎక్సప్యాండింగ్ విధానం ద్వారా 8 జీబీకి వృద్థి చేసుకోవచ్చు. పవర్ మేనేజిమెంట్ అంశాలను పరిశీలిస్తే, వవర్ సేవింగ్ మోడ్‌లో 5గంటలు పాటు నిరంతరాయంగా నోట్‌బుక్ పని చేస్తుంది.

ఇండియన్ మార్కెట్లో ఈ నోట్‌బుక్ ధరను పరిశీలిస్తే రూ.22,999 ఉంటుంది. అయితే ప్రస్తుతం నెలకున్న పోటీ మార్కెట్లో పలు బ్రాండ్లు అధునాతన ఫీచర్లతో రూపొందించిన నోట్‌బుక్‌లను తక్కువ ధరకే అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్‌ఎస్‌ఐ ప్రవేశపెడుతున్న ‘U270’ ఏ మేరకు వినియోగదారులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి మరి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot