‘రిలయన్స్ 3జీ’కి సవాల్ విసరనున్న ‘ఎంటీఎస్ 1055’..!!

Posted By: Staff

‘రిలయన్స్ 3జీ’కి సవాల్ విసరనున్న ‘ఎంటీఎస్ 1055’..!!

రాకెట్‌లా దూసుకుపోతున్న ‘రిలయన్స్ 3జీ’ టాబ్లెట్లకు, మొబైల్ టెలి సిస్టమ్స్ (ఎంటీఎస్) రూపంలో సవాల్ ఎదురుకానుంది. మల్టీ టచ్ వ్యవస్థతో రూపొందిచిన టాబ్లెట్ పీసీల మార్కెట్లోకి ఎంటీఎస్ అడగుపెట్టునుంది. ఎంటీఎస్ తొలి దెబ్బగా రిలయన్స్ 3జీ పై గురిపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ టాబ్లెట్ పీసీల మధ్య వృత్యాసాలను పరిశీలిస్తే, మల్టీ టచ్ వ్యవస్థతో పాటు ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ వ్యవస్థలు ఆధారంగా ఈ రెండు పీసీలు పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆధారిత ఆపరేటింగ్ వ్యవస్థను ‘ఎంటీఎస్’లో పొందుపరచగా, ఆధునిక 2.3 జింజర్ బోర్డు ఆధారిత ఆపరేటింగ్ వ్యవస్థ రిలయన్స్ 3జోలో దర్శనమిస్తుంది.

7 అంగుళాల డిస్‌ప్లే, మల్టీటచ్ స్క్రీన్ వ్యవస్థలు రెండు పీసీలలో సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ప్రొసెసింగ్ అంశాలను పరిశీలిస్తే ఎంటీఎస్‌లో క్వాల్కమ్ MSM7277 ప్రొసెసింగ్ వ్యవస్థను పొందుపరిచారు. డేటా స్టొరేజి అంశాలను పరిశీలిస్తే, ఈ రెండు డివైజుల్లోనూ జీబీని 32కు వృద్థి చేసుకోవచ్చు. ఎంటీఎస్‌లో పొందుపరిచిన బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ వంటి అంశాలు మెరుగైన కనెక్టువిటీని కలిగి ఉంటాయి.

3జీ, జీపీఎస్ వంటి కనెక్టువిటీ అంశాలు రెండు సెట్లలో సమాన ప్రాధాన్యతను సంతరించుకున్నప్పటికి. రిలయన్స్ 3జీలో పొందుపరిచిన 3జీ, జీపీఎస్ కనెక్టువిటీ అంశాలు వినియోగదారుడికి లబ్ధి చేకూరుస్తాయి. ఎంటీఎస్ నావిగేటర్, బెస్ట్ ఎంటీఎస్, మొబైల్ మెయిల్ వంటి ఆప్లికేషన్లను ముందుగానే ఎంటీఎస్ 1055లో లోడ్ చేశారు.

పొందుపరిచిన వాయిస్‌కాల్, వాయిస్ రికార్డింగ్ ఫీచర్లతో పాటు ఆడియో, వీడియో ప్లేయర్లు నాణ్యమైన అనుభూతిని వినియోగాదారునికి అందిస్తాయి. ధర విషయంలోనూ వీటి మధ్య వృత్యాసాన్ని మనం గమనించవచ్చు. ఎంటీఎస్ మార్కెట్ ధర రూ.8,000 అయితే, రిలయన్స్ 3జీ మార్కెట్ ధర రూ. 12,999.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting