‘ప్రతి క్షణం ఉల్లాసభరితం’ - ఎంటీఎస్

ప్రస్తుత మార్కెట్లో జీఎస్ఎమ్ టాబ్లెట్లు అత్యధికంగా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో, ఎంటీఎస్ సీడీఎమ్ఏ వ్యవస్థను సపోర్టు చేసే టాబ్లెట్ పీసీని విడుదల చేయునుంది. అయితే కొన్ని నెలల క్రితమే ఎంటీఎస్ MTAG 3.1, MTS Livewireల పేరుతో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ హ్యాండ్ సెట్లను రూ.5000 మార్కెట్లో ధరలో విడుదల చేసిన విషయం తెలిసిందే.
రూపుదిద్దకుకుంటున్న ఈ టాబ్లెట్ పరికరంలో నాణ్యమైన డిస్ ప్లేతో పాటు, అత్యాధునిక కెమెరా వ్యవస్థను పొందుపరిచిన్నట్లు తెలుస్తోంది. పొందుపరిచిన హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్ వ్యవస్థ, 3జీ, వై - ఫై కనెక్టువిటీ వంటి అంశాలు వినియోగదారుడుకి మరింత లబ్ధి చేకూరుస్తాయి. టాబ్లెట్లో ప్రత్యేక ఆకర్షణగా నలిచే హెచ్ టీ సీ పల్స్ వ్యవస్థ సమాచార వ్యవస్థను మరింత చేరువు చేస్తుంది. భారతీయ వినియోగదారులు కోరుకుంటున్న రీతిలో ‘ఎంటీఎస్’ రూపొందించిన టాబ్లెట్ పీసీ విశేష ఆదరణ చొరగుంటుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications