వెబ్‌క్యామ్ నుంచి భర్త చూస్తుండగానే భార్య ఆత్మహత్య!

Posted By:

ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్ నుంచి భర్త చూస్తుండగానే భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబయ్ ప్రాంతంలో సంచలనం రేపింది. చాటింగ్ సమయంలో భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న వివాదమే ఆత్మహత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. వరకట్న వేధింపుల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలించినట్లయితే..... ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత ఇంకా ఆమె భర్త కొన్ని నెలల క్రితం రహస్య వివాహం చేసుకున్నారు.

వెబ్‌క్యామ్ నుంచి భర్త చూస్తుండగానే భార్య ఆత్మహత్య!

అయితే తరువాత చోటుచేసుకున్న పరిణామాల కారణంగా భార్య భర్తలిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. భర్త తరపు వారు కట్నం క్రింది రూ.20లక్షలను డిమాండ్ చేయటమే ఇందుకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదే ప్రస్తావన చాటింగ్ సమయంలో చోటుచేసుకోవటంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె భర్తచూస్తుండగానే  ఫ్యాన్‌‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot