వేడెక్కిన.. భారతీయం!

Posted By: Staff

వేడెక్కిన.. భారతీయం!

 

దేశంలో టాబ్లెట్ పీసీల మార్కెట్ హీటెక్కింది. తాజాగా దేశీయ కంపెనీ మంగళ ఎలక్ట్రానిక్స్ రెండు అత్యాధునిక టాబ్లెట్ పీసీలను మార్కెట్లో విడదుల చేసింది. పాకెజ్ సైజ్ ప్రొజెక్టర్స్ అదేవిధంగా హ్యూమన్ టచ్‌డోర్ లాక్‌ సిస్టమ్‌లను ఉత్పత్తి చెయ్యటంలో మంగళ ఎలక్ట్రానిక్స్ దిట్ట. మైపాడ్ (MyPad), యుప్ (YUP) మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీలు ఆండ్రాయిడ్ 2.2.1, 2.3.1, 3.0 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తాయి.

భిన్న సైజులు అదే విధంగా వివిధ రూపాంతరాలలో మైపాడ్ టాబ్లెట్ పీసీలు రూపుదిద్దుకున్నాయి. 7 నుంచి 10.2 అంగుళాల డిస్ ప్లే పరిమాణాల్లో ఈ డివైజ్ లు లభ్యంకానున్నాయి. రెండు వేరియంట్ లలో యుప్ టాబ్లెట్ పీసీలు రూపుదిద్దుకున్నాయి. శక్తివంతమైన అప్లికేషన్‌లతో పాటు అద్భుతమైన టచ్ వ్యవస్థలను ఈ గ్యాడ్జెట్‌లలో నిక్షిప్తం చేసినట్లు మంగల్ ఎలక్ట్రానిక్స్ డైరక్టర్ గౌరవ్ జజోడియా తెలిపారు.

యువతకు మరింత లబ్ధి చేకూర్చే క్రమంలో మెరుగైన మల్టీ మీడియా అదేవిధంగా ఉత్తమ క్వాలిటీ మ్యూజిక్ వ్యవస్థలను ఈ పీసీలలో పొందుపరిచారు. 1GHz బుల్ట్‌ఇన్ ప్రాసెసర్ పీసీల పనివేగాన్ని మెరుగుపరుస్తుంది. బలోపేతం చేసిన 3జీ, వై ఫై ఇంటర్నెట్ పనితీరును వేగవంతం చేస్తాయి. వివిధ శ్రేణుల్లో లభ్యమవుతున్న మైపాడ్, యుప్ టాబ్లెట్ పీసీల ధరలు రూ.5000 నుంచి 18,000 మధ్య ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot