నమో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్

Posted By:

ఇండియన్ మార్కెట్లో నరేంద్రమోడీ సంక్షిప్త నామధ్యేయం ‘నమో' మార్మోగుతోంది. ఇటీవల స్మార్ట్ నమో పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల కాగా తాజాగా నమో బ్రాండ్ పేరుతో ఓ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తెరపైకి వచ్చింది. భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్నోవేజన్ (Innovazion) నమో పేరుతో ఓ సరికొత్త ఉచితం యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్థి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ పర్సనల్ కంప్యూటర్లను మాల్వేర్ అలానే వైరస్ దాడుల నుంచి రక్షిస్తుంది.

 నమో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్

ఇన్నోవేజన్ కంపెనీ ప్రస్తుతం ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రాథమిక వర్షన్‌లో మాత్రమే అందిస్తోంది. భవిష్యత్‌లో అద్వాన్సుడ్ వర్షన్‌ను విడుదల చేయనుంది. తద్వారా.. యాపిల్ మ్యాక్ పీసీలకు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ అందిస్తోన్న సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి రెగ్యులర్ అప్‌డేట్‌లను యూజర్లు పొందవచ్చు.

అత్యధిక మంది ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉందని, అయితే వారిలో 13 శాతం మంది మాత్రమే విశ్వసనీయమైన లైసెన్సుడ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారని , 30 శాతం మంది ట్రెయిల్ వెర్షన్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ల పై ఆధారపడుతున్నారని, మిగితా 57శాతం మంది అసలు యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను వాడటం లేదని ఇన్నోవేజన్ కంపెనీ సీఈఓ అభిషేక్ గాగ్‌నెజ తెలిపారు. వీరి లక్ష్యంగా తమ ఉచిత సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ కంపెనీకి ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని అభిషేక్ స్పష్టం చేసారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot