కోటిన్నర దాటిన మోడీ ఫేస్‌బుక్ అభిమానుల సంఖ్య!
దేశ ప్రధానిగా మరికొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ పేజీకి సంబంధించి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. మోదీ ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసేవారి సంఖ్య అంతర్జాతీయంగా రోజురోజుకు పెరుగుతోంది.

నరేంద్ర మోడీ ఫేస్‌బుక్ అకౌంట్ లింక్ అడ్రస్
ప్రజలు ఎన్నుకున్న నేతల్లో ఇలా అత్యంత త్వరితగతిన ఆదరణ పొందుతున్న నేతల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (మొదటి) తరువాతి స్థానంలో నరేంద్ర మోదీ నిలిచారని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో ఎక్కువమంది అభిమానులున్న రాజకీయ నాయకుల్లో మోడీది రెండో స్థానమని ఫేస్‌బుక్ నిర్వాహకులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక్కరే ఆయన కంటే ముందు ఉన్నారని సదరు సోషల్ మీడియా తెలిపింది. భారత్‌లో లోకసభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ రోజైన ఏప్రిల్ 7న మోడీకి కోటి 24 లక్షల మందికి పైగా అభిమానులు ఉండగా.. మంగళవారం నాటికి కోటిన్నర దాటింది.
సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించిన నాటి నుంచి 29 మిలియన్ల భారతీయ ఫేస్‌బుక్ యూజర్లు ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన దాదాపు 227 మిలియన్లు పరస్పర చర్చల్లో పాలుపంచుకున్నట్లు ఓ సర్వే ద్వారా వెల్లడైంది. వీరిలో 13 మిలియన్ల మంది 75 మిలియన్ల చర్చల్లో నరేంద్ర మోడీ గురించి చర్చించుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. అంతర్జాతీయంగా నరేంద్ర మోడీ తరువాతి స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బరకా ఒబామా, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లు ఈ విశ్లేషణలో ద్వారా తేటతెల్లమైంది. దేశీయంగా భారతీయ జనతా పార్టీకి 45.31 లక్షల ఫేస్‌బుక్ అభిమానులు, కాంగ్రెస్‌కు 33.09 లక్షల అభిమానులు, ఆమ్ ఆద్మీ పార్టీకి 21.19 లక్షల ఫేస్‌బుక్ అభిమానులు ఉన్నట్లు సదరు విశ్లేషణలో తేలింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








