త్వరపడండి.. శ్యామ్‌సంగ్ ల్యాపీ రూ.15000/-కే

Posted By: Super

త్వరపడండి.. శ్యామ్‌సంగ్ ల్యాపీ రూ.15000/-కే


కంప్యూటింగ్ మార్కెట్లో నెట్‌బుక్ పరికరాల అమ్మకాలు జోరును దృష్టిలో ఉంచుకుని దిగ్గజ సాంకేతిక పరికరాల తయారీదారు ‘శ్యామ్‌సంగ్’ రూ.15000లకే అత్యాధునిక నెట్‌‌బుక్ పరికరాన్ని మార్కెట్లో ప్రేవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. క్లుప్తంగా ఈ నెట్‌బుక్ ఫీచర్లను పరిశీలిస్తే..

- ‘శ్యామ్‌సంగ్ NC110-A07’ మోడల్‌గా రూపుదిద్దుకున్న ఈ నోట్‌బుక్ పరికరం వేగవంతమైన విండోస్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది.
- 10.1 అంగుళాల డిస్ ప్లే 1024 x 600 పిక్సల్ రిసల్యూషన్ సామర్ధ్యంతో నాణ్యమైన విజువల్స్‌ను అందిస్తుంది.
- శక్తివంతమైన 1.66 GHz ఇంటెల్ ఆటమ్ N570 ప్రొసెసర్, 1జీబీ ర్యామ్ వంటి అంశాలను మన్నికైన పనితీరును ప్రదర్శిస్తాయి.
- word ప్రొసెసింగ్ ఆప్లికేషన్లతో పాటు ఇ - మెయిల్ సర్వీస్, ఇంటర్నెట్ సర్ఫింగ్, ఫోటో‌షాప్ అంశాలను ఈ నెట్‌బుక్ ఆధారితంగా సమర్ధవంతంగా నిర్వహించుకోవచ్చు.
- 320జీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్ పటిష్ట స్టోరేజి వ్యవస్థను కలిగి ఉంటుంది.
- నెట్‌బుక్‌లో ఏర్పాటు చేసిన SRS 3డీ సౌండ్ వ్యవస్థ నాణ్యమైన ఆడియో అవుట్ పుట్‌ను వినియోగదారుడికి అందిస్తుంది.
- అత్యల్పంగా 1.18కిలో గ్రాముల బరువుతో రూపుదిద్దుకున్న ఈ నోట్‌బుక్ ఆకర్షించే ఎరుపు రంగులో వినియోగదారులను అలరించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot